అత్యాచార బాధితురాలిని జైలులోనే వివాహం చేసుకున్నాడో నిందితుడు. బెయిల్ కావాలంటే సదరు బాధితురాలిని వివాహం చేసుకోవాల్సిందేనంటూ ఒడిశా పోక్సో న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఈ మేరకు వివాహం జరిగింది. ఒడిశాలో జరిగిన ఈ పెళ్లికి జైలు అధికారులు, న్యాయవాదులు పెళ్లి పెద్దలుగా నిలిచారు.
వివాహ తంతు ముగిసిన తర్వాత వధువు తన అత్తమామల వద్దకు వెళ్లగా.. రాజేశ్ సింగ్ మాత్రం బెయిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. బెయిలు వచ్చేవరకు అతను జైల్లోనే ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు.
పెళ్లి అయితేనే బెయిల్..
ఒడిశాలోని గురుదిజాటియాకు చెందిన రాజేశ్ సింగ్ ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో రాజేశ్‌ను పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి.. పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడికి జైలు శిక్ష పడింది.
అనంతరం సింగ్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. వాదనలు విన్న పోక్సో కోర్టు.. బాధితురాలిని వివాహం చేసుకుంటేనే బెయిలు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత నెలలోనే 18ఏళ్లు నిండిన బాధితురాలితో జైలు ప్రాంగణంలో ఏడడుగులు నడిచాడు ఖైదీగా ఉన్న రాజేష్ సింగ్.
ఎన్జీఓ సహాయంతో..
స్థానిక ఎన్జీఓ సహకారంతో జైలు అధికారులు ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశారు. చౌద్వార్ జైల్లో జరిగిన రిసెప్షన్‌కు సూపరింటెండెంట్ కులమణి బెహెరా సహా.. తోటి ఖైదీలు హాజరయ్యారు.
ఇదీ చదవండి: 'మనోవర్తి చెల్లించకుంటే జైలుకు పంపుతాం'