ETV Bharat / bharat

'రామ మందిరానికి ఇంటింటి చందాలు నిలిపేశాం'

ఇకపై రామమందిర నిర్మాణానికి ఆన్​లైన్​ చందాలు మాత్రమే స్వీకరిస్తున్నట్లు రామజన్మభూమి తీర్థ‌ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపి వేసినట్టు వెల్లడించారు.

ramtemple door to door donations collection has stopped
రామ మందిరానికి ఇంటింటి చందాలు నిలిపేశాం
author img

By

Published : Mar 6, 2021, 10:53 PM IST

Updated : Mar 6, 2021, 10:58 PM IST

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపి వేసినట్టు రామజన్మభూమి తీర్థ‌ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో తమ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. మూడేళ్లలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఆలయం ముందు మరికొంత స్థలం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

రామ మందిరం నిర్మాణం కోసం నిధులు సేకరించాలని ట్రస్టు వీహెచ్‌పీని కోరింది. దీంతో దేశ వ్యాప్తంగా జనవరి నుంచి విరాళాల సేకరణ ప్రక్రియ మొదలైంది. సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచినంత మొత్తాన్ని అయోధ్య రాముడి మందిరం నిర్మాణం కోసం విరాళాలుగా అందజేశారు. గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి: రామమందిరం కోసం రూ. కోటితో మరికొంత భూమి కొనుగోలు

Last Updated : Mar 6, 2021, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.