ETV Bharat / bharat

Rakhi For Soldiers : సైనికులకు 27 అడుగుల స్పెషల్​ రాఖీ.. 21 మంది వీరజవాన్ల చిత్రాలతో..

Rakhi For Soldiers : భారతదేశ సైనికుల కోసం ప్రత్యేకమైన రాఖీని సిద్ధం చేసింది ఛత్తీస్​గఢ్​​లోని సాయిమౌళి ఆలయ కమిటీ. 27 అడుగుల పొడవు, 6 ఆరు అడుగుల వెడల్పుతో రూపొందించిన ఆ రాఖీలో.. 21 మంది వీరజవాన్ల ఫొటోలను అమర్చింది. వారితోపాటు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ చిత్రాలను కూడా పెట్టింది. ఆ ప్రత్యేకమైన రాఖీని మీరు కూడా చూసేయండి.

Rakhi For Soldiers
Rakhi For Soldiers
author img

By

Published : Aug 22, 2023, 10:38 AM IST

Updated : Aug 22, 2023, 11:03 AM IST

సైనికులకు 27 అడుగుల స్పెషల్​ రాఖీ

Rakhi For Soldiers : రక్షాబంధన్​ సందర్భంగా ఛత్తీస్​గఢ్.. బిలాస్​పుర్​ జిల్లాలోని సాయిమౌళి ఆలయ కమిటీ.. దేశ సైనికుల కోసం ప్రత్యేకమైన రాఖీని సిద్ధం చేసింది. పంజాబ్‌లోని ఉధంపుర్ సైనికులకు పంపేందుకు.. 27 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో రాఖీని తయారు చేసింది. ఈ ప్రత్యేకమైన రాఖీలో 21 వీరజవాన్ల ఫొటోలను అమర్చింది. వీరి పేర్లను ఇటీవలే భారత ప్రభుత్వం.. 21 అండమాన్​ నికోబర్​ దీవులకు పెట్టింది.

Rakhi For SoldiersRakhi For Soldiers
సాయిబాబా విగ్రహం ముందు స్పెషల్​ రాఖీ

మోదీ, ద్రౌపదీ ముర్ము ఫొటోలు కూడా..
Rakhi Making For Soldiers : ఈ ప్రత్యేకమైన రాఖీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్​ సింగ్​ చిత్రాలను కూడా ఉంచారు. వీరితోపాటు పరమవీరచక్ర విజేతల ఫొటోలు కూడా పెట్టారు. మొత్తంగా 27 ఫొటోలు ఉన్నాయి. ఈ రాఖీని సాయిమౌళి ఆలయ కమిటీ.. జిల్లా సైనిక్ సంక్షేమ బోర్డు బిలాస్​పుర్​ అధికారుల ద్వారా రోడ్డు మార్గంలో ఉధంపుర్​కు తరలించింది. ఈ కమిటీ గతేడాది 15 అడుగుల పొడవైన రాఖీని తయారు చేసి లద్దాఖ్​ సైనికులకు పంపింది.

Rakhi For Soldiers
గతేడాది తయారు చేసిన రాఖీతో లద్దాఖ్​ సైనికులు

'కొన్నినెలల పాటు కష్టపడి..'
Rakhi Message For Soldiers : ఈ ప్రత్యేక రాఖీ గురించి కమిటీ సమన్వయకర్త దిలీప్ దేవర్కర్ పాత్రేకర్.. ఈటీవీ భారత్​తో మాట్లాడారు. "దేశంలోని సైనికులకు వారి ఇంటి నుంచి వచ్చిన రాఖీ చేరడం కష్టం. ఒకవేళ చేరిన అది చిన్నగానే ఉంటుంది. అందుకే మేం ఈ ప్రత్యేకమైన రాఖీని తయారు చేశాం. గతేడాది రెండున్నర అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు ఉన్న రాఖీని తయారు చేసి.. లద్దాఖ్​కు పంపాం. ఈ సారి కాస్త భిన్నంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే కొన్ని నెలలపాటు కష్టపడి 27 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో రాఖీ తయారు చేశాం" అంటూ చెప్పుకొచ్చారు.

Rakhi For Soldiers
రాఖీ తయారు చేస్తున్న కమిటీ సభ్యులు

స్పెషల్​ రాఖీ తయారీకి కారణమిదే!
Rakshabandhan Special : స్పెషల్​ రాఖీ తయారీ వెనుక కారణాన్ని కమిటీ సభ్యుడు రాజన్​ పాఠే తెలిపారు. "మనం మన ఇళ్లల్లో హాయిగా జీవిస్తున్నాం. మనల్ని శత్రుదేశాల నుంచి కాపాడేందుకు సైనికులు మాత్రం దేశ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది చిన్న రాఖీలు పంపిస్తారు. కానీ ఈ పెద్ద రాఖీ.. దేశ ప్రజలు తమను ఎప్పుడూ ప్రేమిస్తారని గుర్తుచేస్తూ ఉంటోంది. మనం పండుగ రోజుల్లో ఆనందంగా ఉంటాం. వారు మాత్రం పండుగ రోజుల్లో కూడా విధులు నిర్వర్తిస్తుంటారు. అందుకే ఈ రాఖీని సిద్ధం చేశాం" అని రాజన్​ పాఠే చెప్పారు.

Rakhi For Soldiers
సాయిమౌళి కమిటీ తయారు చేసిన రాఖీ

ఈ రాఖీ గిఫ్ట్‌లతో అక్కాచెల్లెళ్లకు 'రక్ష'గా నిలుద్దాం!

రక్షా బంధన్ .. ఈ తీయని వేడుక ఎలా మొదలైందో తెలుసా?!

Last Updated : Aug 22, 2023, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.