ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విద్యాప్రమాణాల నిర్వహణ, అనుబంధ వృత్తినిపుణుల సేవల క్రమబద్ధీకరణకు వీలు కల్పించే.. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ బిల్లు- 2020కి మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది.
"హెల్త్‌కేర్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని గుర్తించాము. ఈ బిల్లు ద్వారా 8-9 లక్షల మంది అనుబంధ వృత్తినిపుణులు లబ్ధిపొందడమే కాక భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆరోగ్య రంగానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను తీర్చే విధంగా ఈ బిల్లును రూపొందించాము. దీని ద్వారా ఈ రంగంలో ఉన్న విభాగాలకు అత్యున్నత ప్రమాణాలు ఉండే విధంగా తీర్చిదిద్దడం సులవు అవుతుంది."
-హర్షవర్ధన్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి : దీదీకి ఈసీ ఘాటు లేఖ