ETV Bharat / bharat

ఎదురులేని జైశంకర్.. రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక.. మరో ఇద్దరు సైతం.. - జైశంకర్ నామినేషన్

Rajya Sabha Election 2023 Gujarat : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు గుజరాత్​ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి జైశంకర్​ సహా మరో ఇద్దరు.. జులై 20న ప్రారంభమయ్యే రాజ్యసభ సమావేశాల్లో సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు.

gujarat rajya sabha election 2023
gujarat rajya sabha election 2023
author img

By

Published : Jul 17, 2023, 3:48 PM IST

Updated : Jul 17, 2023, 3:56 PM IST

Rajya Sabha Election 2023 Gujarat : విదేశాంగ మంత్రి జైశంకర్​ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్ధులు జైశంకర్​, బాబుభాయ్​ దేశాయ్​, కేశ్రీ దేవ్​సింహ్​ ఝాలా గుజరాత్​ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు జులై 20న ప్రారంభమయ్యే రాజ్యసభ సమావేశాల్లో సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. కాంగ్రెస్​, ఆప్​లు తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడం వల్ల.. వేసిన డమ్మీ నామినేషన్లను బీజేపీ అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా బీజేపీ అభ్యర్థులతో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు పోటీలో నిలిచారు. అయితే, నిబంధనల ప్రకారం స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది శాసనసభ్యులు మద్దతు లేకపోవడం వల్ల వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. పూర్తైన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించనుంది.

Jaishankar Rajya Sabha : అంతకుముందు జులై 11న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్​. నామినేషన్​ దాఖలు సమయంలో ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర​ బీజేపీ చీఫ్ సీఆర్​ పాటిల్ ఉన్నారు. గాంధీనగర్​లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రీటా మెహతాకు.. జైశంకర్ నామినేషన్​ పత్రాలు సమర్పించారు. ​మరోసారి తనకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వానికి, గుజరాత్​ ప్రజలకు జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు.

Gujarat Rajya Sabha Election 2023 : గుజరాత్‌లో మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో 8 మంది బీజేపీ నుంచి ఉండగా.. ముగ్గురు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి ఉన్న ఎనిమిది మంది సభ్యుల్లో కేంద్రమంత్రి జైశంకర్‌, జుగాలి ఠాకూర్‌, దినేశ్ అనవాడియా పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 18తో ముగియనుంది. ఈ తరుణంలోనే ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 182 మంది సభ్యులు కలిగిన గుజరాత్‌ అసెంబ్లీలో తమకు తగినంతమంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేనందున.. ఎన్నికల్లో పాల్గొనడం లేదని కాంగ్రెస్​, ఆప్​ పేర్కొన్నాయి. గతేడాది జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గానూ బీజేపీ రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 17 స్థానాలకే పరిమితమైంది. కాగా, నాలుగేళ్ల క్రితం జైశంకర్​ గుజరాత్​ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

ఇవీ చదవండి : లోక్​సభ పని చేసింది 45 గంటలే.. రాజ్యసభ లెక్క ఇదీ..

త్వరలో రాజ్యసభ ఎన్నికలు.. కేంద్రమంత్రి జైశంకర్‌ నామినేషన్‌.. పోటీకి కాంగ్రెస్​ దూరం

Last Updated : Jul 17, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.