ETV Bharat / bharat

‘తూత్తుకుడి’పై రజనీకాంత్‌కు మరోసారి సమన్లు - మద్రాస్​ హైకోర్టు

రజనీకాంత్​కు మద్రాస్​ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ జగదీశన్​ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్​ సమన్లు జారీ చేసింది. రెండేళ్ల కిందట తమిళనాడులోని తూత్తుకుడి ఆందోళనల ఘటనపై రజనీ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది.

Rajinikanth summoned on January 19 in Tuticorin firing case over his remarks
‘తూత్తుకుడి’పై రజనీకాంత్‌కు మరోసారి సమన్లు
author img

By

Published : Dec 21, 2020, 10:53 PM IST

రెండేళ్ల క్రితం తమిళనాడులోని తూత్తుకుడి ఆందోళనల ఘటనపై సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఆయన చేసిన 'అసాంఘిక శక్తుల' వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ జగదీశన్‌ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 19న కమిషన్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

తూత్తుకుడిలోని వేదాంతా స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలంటూ 2018లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో రజనీకాంత్‌ స్పందిస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. తన వ్యాఖ్యలపై రజనీని వివరణ కోరగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. అయితే 'ఎలా తెలిసిందో నన్ను అడగకండి.. నాకు అన్నీ తెలుసు' అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో రజనీ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకోలేదు.

కాగా.. ఈ ఘటనలో ఏకసభ్య కమిషన్‌ గతంలోనూ రజనీకి సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుకున్నారు. కొవిడ్‌ దృష్ట్యా ఆలస్యమైన దర్యాప్తును ఇటీవల మళ్లీ వేగవంతం చేయడంతో రజనీకి మరోసారి సమన్లు జారీ అయ్యాయి.

ఇదీ చూడండి: 'విద్యుత్తు' హక్కుల పరిరక్షణకు కొత్త నిబంధనలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.