రాజస్థాన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. 15మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు(rajasthan cabinet reshuffle). జైపుర్లోని రాజ్భవన్లో గవర్నర్ కల్రాజ్ మిశ్రా.. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 11మంది కేబినెట్ మంత్రులు కాగా.. నలుగురు సహాయ మంత్రులు.
కొత్త మంత్రివర్గంలో ఎస్సీ వర్గం నుంచి నలుగురికీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది(rajasthan cabinet news).
శనివారం.. సీఎం అశోక్ గహ్లోత్ కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. కాగా.. వారిలో ముగ్గురిని మాత్రమే పక్కనపెట్టి, మిగిలిన మంత్రులు ఆదివారం తిరిగి ప్రమాణం చేశారు. మొత్తం మీద గహ్లోత్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 30కి చేరింది.
సచిన్ వర్గం..
నూతన మంత్రివర్గంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఐదుగురు ఏమ్మెల్యేలు హేమరామ్ చౌదరి, మురారీలాల్ మీనా, జహిదా ఖాన్, రాజేంద్ర సింగ్, బ్రిజేంద్ర ఓలాకు అశోక్ గహ్లోత్ కేబినేట్లో చోటు కల్పించారు.
అంతకుముందు.. జైపుర్లోని పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు(rajasthan congress). సీఎం అశోక్ గహ్లోత్, రాష్ట్ర ఇన్ఛార్జ్ అజయ్ మాకెన్ భేటీలో పాల్గొన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేలను రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా సన్మానించారు.
ఇదీ చూడండి:- 'అవును.. లంచం ఇచ్చాం'.. సీఎం ముందే ఒప్పుకున్న ఉద్యోగులు!