ETV Bharat / bharat

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా అసమాన కీర్తి

కల్యాణ్​సింగ్​.. దేశ రాజకీయాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేని నేత. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా జెండా ఎగరేసిన కాషాయ కురువృద్ధుడు. పదవులు ఆశించకుండా, పార్టీకి కష్టపడి సేవ చేసే నైజం ఆయన సొంతం. నిబద్ధతతో పనిచేసి ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త నుంచి సీఎం పదవి దాకా ఎదిగారు. యూపీ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన కల్యాణ్​ సింగ్​ ప్రస్థానం మీకోసం..

KALYAN SINGH
కల్యాణ్ సింగ్
author img

By

Published : Aug 21, 2021, 10:14 PM IST

భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టి.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిన కల్యాణ్​ సింగ్​ ప్రస్థానం.. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే వారికి పాఠం వంటిది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో ప్రత్యర్థులను సైతం నేర్పుగా ఆకట్టుకోగలిగిన ఆయన.. తన పట్టుదల, సంకల్పమే ఆయుధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి.. అత్యున్నత పదవులు పొందే స్థాయికి చేరారు. పోరాటం, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చనేదానికి కల్యాణ్ సింగ్ జీవితం నిదర్శనం.

ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త నుంచి సీఎంగా..

KALYAN SINGH
కల్యాణ్​సింగ్​ ప్రస్థానం

తిరుగులేని విజయాలు..

KALYAN SINGH
కల్యాణ్​సింగ్​ ప్రస్థానం

రాజకీయ చతురత..

1993 ఎన్నికల్లో భాజపా మెజారిటీ సాధించినప్పటికీ.. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ, మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ప్రతిపక్ష హోదాలోనూ తనదైన శైలిలో నిరసన గళం వినిపించారు కల్యాణ్ సింగ్. 'గెస్ట్ హౌస్' ఘటనతో నాలుగేళ్లలోపే సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉండగా.. బీఎస్​పీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది భాజపా. ఆరు నెలల ఒప్పందానికిగాను మాయావతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. భాజపాకు సీఎం పీఠాన్ని అప్పగించే సమయంలో బీఎస్​పీ మద్దతు ఉపసంహరించుకుని షాక్​ ఇచ్చింది. ఆ సమయంలోనూ కల్యాణ్ సింగ్ పట్టువదలలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకుసాగారు. ఈ నేపథ్యంలో.. అప్పుడే కాంగ్రెస్​ను వీడి లోకతాంత్రిక్ కాంగ్రెస్​ పార్టీని ఏర్పాటుచేసిన నరేష్ అగర్వాల్​ను కలిశారు కల్యాణ్​ సింగ్​. నరేష్​ అగర్వాల్​కు చెందిన 21 మంది ఎమ్మెల్యేల​ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు అండగా నిలిచిన అగర్వాల్‌కు విద్యుత్ శాఖను కేటాయించి రాజకీయ చతురతను చాటారు.

రాజకీయ జీవితం..

KALYAN SINGH
కల్యాణ్​సింగ్​ ప్రస్థానం

పార్టీతో విభేదాలు..

1990ల చివరి నాటికి కల్యాణ్ సింగ్ జాతీయస్థాయి రాజకీయాల్లో ప్రముఖ నేతగా ఎదిగారు. అయితే భాజపా అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయీతో విభేదాల కారణంగా 1999లో పార్టీని వీడారు. తిరిగి ఐదేళ్ల తరువాత భాజపాలో చేరి బులంద్‌షెహర్ ఎంపీగా పోటి చేసి గెలిచారు. 2009లో అంతర్గత విభేదాల కారణంగా మళ్లీ భాజపాను వీడారు. అదే ఏడాది జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఎటా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 'జన్ క్రాంతి' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నాటి భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ దౌత్యంతో తన పార్టీని భాజపాలో విలీనం చేశారు. 2014 ఆగస్టు 26న రాజస్థాన్ గవర్నర్​గా ఆయన్ని భాజపా నియమించి సమున్నత గౌరవాన్నిచ్చింది. అంతేగాక.. 2015లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను సైతం అప్పగించింది.

విమర్శలు..

అయితే ఎన్ని విమర్శలు ఎదురైనా.. తనదైన శైలిలో ముందుకు సాగడం కల్యాణ్​ సింగ్​కు అలవాటు. వ్యక్తిగత నిర్ణయాలతో సంబంధం లేకుండా.. భారత రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే నేతగా ఆయన నిలిచిపోతారు. తను కన్న కలలను నెరవేర్చుకునేందుకు జీవితకాలం కృషి చేసిన నాయకునిగా.. ఉత్తర్​ప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో అతిశయోక్తి లేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.