ETV Bharat / bharat

18న దేశవ్యాప్తంగా 'రైల్‌ రోకో'- రైతు సంఘాల పిలుపు - ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్​ రోకో

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రహదారుల ముట్టడిని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘం నేతలు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్​ రోకో చేపట్టాలని నిర్ణయించారు.

DL-FARMERS-AGITATION
18న దేశవ్యాప్తంగా 'రైల్‌ రోకో'!
author img

By

Published : Feb 10, 2021, 8:58 PM IST

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల జాతీయ, రాష్ట్ర రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు సింఘు సరిహద్దు వద్ద సమావేశమైన సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నెల 18న రైల్​ రోకోలో భాగంగా నాలుగు గంటల (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) పాటు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, ఈ నెల 12 నుంచి రాజస్థాన్‌లోని అన్ని టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ కలెక్షన్‌ను కొనసాగనీయబోమని తెలిపింది.

పుల్వామా అమర జవాన్లకు నివాళి

పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళిగా ఈ నెల 14న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: శశికళ రాకతో అన్నాడీఎంకేలో కలవరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.