ETV Bharat / bharat

'మతం పేరుతో విభేదాలు సృష్టిస్తున్న ప్రధాని'

ఆర్​ఎస్​ఎస్​, ప్రధాని మోదీ.. మతం పేరిట ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. కేరళ కొట్టాయం జిల్లా ఎరుమేలిలో అయ్యప్ప దేవాలయం, వావర్​ మసీదులో ఆయన ప్రార్థనలు చేశారు. విభజన శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

Rahul offers prayer
'మతం పేరుతో విభేదాల్ని సృష్టిస్తున్న ప్రధాని'
author img

By

Published : Mar 28, 2021, 7:30 AM IST

మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని ఆర్​ఎస్ఎస్, ప్రధాని మోదీ లక్ష్యంగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ​ విరుచుకుపడ్డారు. కేరళ కొట్టాయం జిల్లా ఎరుమేలిలోని అయ్యప్ప దేవాలయం, వావర్​ మసీదులో ఆయన శనివారం ప్రార్థనలు చేశారు. అనంతరం.. పతనమ్​తిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

"సంతోషంగా, ప్రశాంతంగా జీవించడం, ఇతరుల ప్రయోజనాలను పరిరక్షించడం.. ఇదే దేశానికి మనం ఇవ్వగలిగే అతిపెద్ద కానుక. ఆర్​ఎస్​ఎస్​తో పాటు ప్రధాని...​ ప్రజల మధ్య ద్వేషాన్ని సృష్టిస్తున్నారు. దానివల్ల ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లు.. మరో సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లతో గొడవలకు దిగుతారు. ఇలాంటి విభజన శక్తుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

శబరిమలను సందర్శించే ముందు ఎరుమేలీలోని వావర్​ మసీదు, అయ్యప్ప ఆలయాన్ని భక్తులు దర్శించుకునే ఆనవాయితీని రాహుల్​ కొనియాడారు. జీఎస్​టీ, నోట్లరద్దు, వ్యవసాయ చట్టాలతో ప్రజల డబ్బును ఎన్​డీఏ, ఎల్​డీఎఫ్​ దోచుకుంటున్నాయని ఆరోపించారు.

ఇదీ చూడండి:'అట్టడుగు వ్యక్తి న్యాయం కోసం కోర్టు తలుపు తట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.