కేంద్రాన్ని ప్రశ్నించిన వారు జైలుపాలు అవుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం, పెట్రో ధరల పెంపునకు సంబంధించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంప విమర్శల దాడికి దిగారు.
"ఈ వాక్యాన్ని పూరించండి : స్నేహం కోసం రఫేల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, పన్ను వసూలు కోసం పెట్రో ధరలు పెంచారు, విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారు. ప్రశ్నించిన వారికి జైలు శిక్ష, మోదీ ప్రభుత్వం ......" అని రాహుల్ ట్వీట్ చేశారు.
అంతకుముందు.. రఫేల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదని రాహుల్ ప్రశ్నించారు. రూ.59వేల కోట్ల రఫేల్ ఒప్పందంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి : 'రఫేల్ డీల్'పై రాహుల్ సర్వే