కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మరోసారి విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల కొరత, వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తత, ధరల పెరుగుదల, రైతుల ఆందోళన వంటి వాటికి కారణమెవరో దేశ ప్రజలకు తెలుసునని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
"దశాబ్దాల తరబడి నిర్మిస్తూ వచ్చినదాన్ని కొన్ని క్షణాల్లో నాశనం చేశారు. టీకాల కొరత, వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తత, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థలు, రైతుల నిరసన వంటి క్లిష్ట పరిస్థితులను ఎవరు తీసుకువచ్చారో దేశ ప్రజలకు తెలుసు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
గల్వాన్ లోయలో భారత సైన్యానికి, చైనా బలగాలకు మధ్య మరోసారి ఘర్షణ జరిగిందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పేర్కొంటూ.. రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. "రక్షణ, విదేశాంగ విధానాలను భారత ప్రభుత్వం రాజకీయ సాధనాలుగా ఉపయోగించుకోవడం దేశాన్ని బలహీనంగా మార్చింది. గతంలో ఎప్పుడూ భారత్ ఇలాంటి దుర్భర స్థితిలో లేదు." అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వాటిపై చర్చకు రాహుల్ పట్టు- నో చెప్పిన ఛైర్మన్!
ఇదీ చూడండి: రాహుల్‌తో పీకే భేటీ- ఆ ఎన్నికలపై చర్చ!