ETV Bharat / bharat

'కరోనా మృతుల పట్ల మోదీ మొసలి కన్నీరు' - జైరాం రమేష్ ట్విట్టర్​

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. వ్యాక్సిన్లు ఇవ్వాల్సిందిపోయి కొవిడ్ మృతుల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ​గాంధీ మండిపడ్డారు. మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం చేసింది శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శించారు.

Rahul Gandhi
రాహుల్ ​గాంధీ
author img

By

Published : May 22, 2021, 11:01 PM IST

దేశంలో 'అత్యధిక కొవిడ్ మరణాలకు' సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో సరైన టీకా విధానం అందుబాటులో లేదని.. ఆర్థిక వ్యవస్థ సైతం తీవ్రంగా పతనం అవుతోందన్నారు.

"ఓ వైపు టీకాలు అందుబాటులో లేవు.. మరోవైపు జీడీపీ పతనావస్థలో ఉంది. ఇంకోవైపు అధికంగా నమోదవుతున్న కరోనా మరణాలు. వీటిపై భారత ప్రభుత్వ స్పందనేంటి?. కరోనాతో మరణించిన ప్రజలకు నివాళులర్పించే కార్యక్రమంలో మోదీ "మొసలి కన్నీళ్లు" కార్చారు."

-రాహుల్​ గాంధీ

కొవిడ్ టీకాల పంపిణీలో ప్రభుత్వం పేలవమైన పనితీరు కనబర్చిందని కాంగ్రెస్ సీనియర్​ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు.. వాస్తవంలో భారీ వ్యత్యాసం ఉందని ఆయన ట్విట్టర్​లో ఆరోపించారు.

"దేశీయ టీకా ఉత్పత్తిదారుల సామర్థ్యంపై ఉన్న సమాచారాన్ని పంచుకోవాలి. టీకా వారీగా ఆర్డర్లు, దిగుమతి ఒప్పందాల సమాచారమేమీ వెల్లడించలేదు."

- జైరాం రమేష్

"టీకా పంపిణీ వేగవంతం చేయకపోతే.. మూడోదశను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఇది ప్రభుత్వానికి చివరి హెచ్చరిక లాంటిదే."

- చిదంబరం

కేంద్ర ప్రభుత్వ టీకా విధానాన్ని కాంగ్రెస్ గత కొద్దిరోజులుగా విమర్శిస్తూ వస్తోంది.

ఇవీ చదవండి: 'కేంద్రం వ్యాక్సిన్​ విధానంతో మూడో దశ ముప్పు'

దృష్టి మళ్లించడమే కేంద్రం విధానం: రాహుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.