ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ నూతన సీఎంగా పుష్కర్​ సింగ్ ధామీ

author img

By

Published : Jul 3, 2021, 3:39 PM IST

Updated : Jul 3, 2021, 7:34 PM IST

Pushkar Singh Dhami elected as new cp of uttarakhand
ఉత్తరాఖండ్​ నూతన సీఎంగా పుష్కర్​ సింగ్ ధామీ

15:36 July 03

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ నియమితులయ్యారు. దెహ్రాదూన్​లో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ పాల్గొన్నారు.

ఏడాది కాలంలో ఉత్తారఖండ్​కు ముగ్గురు ముఖ్యమంత్రులు రావడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే తీరథ్​ సింగ్‌ రాజీనామా చేయటం వల్ల కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది. అంతకుముందు సీఎంగా ఉన్న త్రివేంద్ర సింగ్​ రావత్​ను భాజపా అధిష్ఠానం మార్చింది.

నూతన సీఎంగా ఎంపికైన పుష్కర్ సింగ్... ఉత్తరాఖండ్​లోని ఖటీమా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

పెద్ద బాధ్యత..

భాజపా అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పెద్ద బాధ్యత అప్పగించిందని సీఎంగా ఎన్నికైన అనంతరం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ప్రధాని మోదీ, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. అందరితో కలిసి పనిచేస్తానన్నారు. పుష్కర్​ సింగ్​.. ఆదివారం  సాయంత్రం 6 గంటలకు రాజభవన్​లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు నూతన కేబినెట్​ మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు.

రాజ్‌నాథ్‌కు అత్యంత సన్నిహితుడు..

45 ఏళ్ల పుష్కర్‌ సింగ్‌ ధామి.. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. 1975 సెప్టెంబరు 16న పితోడ్‌గఢ్‌లోని కనాలిచిన్నా ప్రాంతంలో జన్మించారు. 2002లో లఖ్‌నవూ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2002 నుంచి 2006 మధ్య భాజపా రాష్ట్ర జనతా యువ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భగత్‌ సింగ్‌ కోశ్యారీకి ఓఎస్డీ(ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా పనిచేశారు. సీఎంగా తనను ఎన్నుకోవడంతో పుష్కర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తన ముందు పెద్ద సవాల్‌ ఉందని, అయితే పార్టీతో కలిసి పనిచేస్తానని అన్నారు. 

4 నెలల్లో మూడో సీఎం..

ఉత్తరాఖండ్‌లో గత నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారారు. పార్టీలో అసమ్మతి సెగతో ఈ ఏడాది మార్చిలో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత మార్చి 10న తీరథ్‌ సింగ్‌ రావత్‌ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన.. సీఎం పీఠంపై కొనసాగాలంటే సెప్టెంబరు 10లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గంగోత్రి, హల్ద్వానీ స్థానాల్లో ఏదో ఒకదాన్నుంచి ఆయన ఉప ఎన్నికల బరిలో దిగుతారని తొలుత అంచనాలు వెలువడ్డాయి. అయితే ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చితోనే ముగియనుండటం, కొవిడ్‌ మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో ఎన్నికల సంఘం ఉపఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా లేదు.  మరోవైపు సీఎం అయ్యాక పలు వివాదాస్పద వ్యాఖ్యలతో భాజపా అధిష్ఠానానికి తీరథ్‌సింగ్‌ తలనొప్పులు తెచ్చిపెట్టారు. దీంతో సీఎంను మార్చేందుకే భాజపా మొగ్గుచూపింది. అయితే తీరథ్‌ విషయంలో ఎదురైన సమస్యల దృష్ట్యా.. ఈ సారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేను తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఎమ్మెల్యే పుష్కర్‌ సింగ్‌ను తదుపరి సీఎంగా ప్రకటించింది. దీంతో నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రంలో ముగ్గురు సీఎంలు మారినట్లైంది. 

భారీ మెజారిటీతో గెలుస్తాం..

 పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో 2022లో జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలుస్తామని భాజపా ఎంపీ అజయ్ భట్​  ధీమా వ్యక్తం చేశారు.

Last Updated : Jul 3, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.