ETV Bharat / bharat

బెంజి కారులో వచ్చి రేషన్ తీసుకెళ్లిన 'పేదవాడు'.. వీడియో వైరల్​ - బెంజి కారులో రేషన్​

బెంజి కారులో వచ్చి ఓ వ్యక్తి రేషన్​ సరుకులు తీసుకెళ్లాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీంతో రేషన్​ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది.

Man picks up wheat and cheap ration in a mercedes
Man picks up wheat and cheap ration in a mercedes, video goes viral
author img

By

Published : Sep 6, 2022, 9:11 PM IST

Updated : Sep 6, 2022, 10:29 PM IST

బెంజి కారులో వచ్చి రేషన్​ సరుకులు తీసుకెళ్తున్న వ్యక్తి

పేద ప్రజల కోసం ప్రభుత్వాలు అందించే రేషన్‌ పంపిణీలో జరిగే అవకతవకలు మరోసారి బయటికొచ్చాయి. ఓ వ్యక్తి రేషన్‌ దుకాణంలో సరకులు తీసుకునేందుకు ఏకంగా బెంజి కారులో వచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. హోషియార్‌పుర్‌లోని ఓ ప్రభుత్వ రేషన్‌ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగి నేరుగా రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. తన బీపీఎల్‌ (బిలో పావర్టీ లైన్) కార్డు చూపించి సరకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ సంచులను కారు డిక్కీలో పెట్టించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి రేషన్‌ దుకాణం నుంచి కారులో సరకులు తీసుకెళ్తోన్న వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది.

సదరు రేషన్‌ దుకాణాన్ని అమిత్‌ కుమార్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ వీడియో వైరల్‌ అవడంతో స్థానిక మీడియా విలేకరులు అమిత్‌ను ప్రశ్నించారు. అయితే ఆ వ్యక్తికి బీపీఎల్‌ కార్డు ఉందని.. తాను కేవలం ఆ కార్డును పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని తెలిపారు. అతడు కారులో వచ్చిన విషయం తనకు తెలియదన్నారు.
అయితే ఈ వీడియో కాస్తా తీవ్ర వివాదానికి దారితీయడంతో ఆ బెంజి కారులో వచ్చిన వ్యక్తి స్పందించాడు. ఆ కారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి ముందు పార్క్‌ చేసి వెళ్లారని చెప్పాడు. అందుకే అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తున్నానని తెలిపాడు. తాను పేద వ్యక్తినే అని, డబ్బుల్లేక తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.

ఇవీ చదవండి: షాకింగ్​ వీడియో.. మహిళ మీద నుంచి దూసుకెళ్లిన వాటర్​ ట్యాంకర్.. అక్కడికక్కడే..

పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ఎక్కడంటే

Last Updated : Sep 6, 2022, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.