Professor Hema Sane Inspirational Life : సాధారణంగా ప్రొఫెసర్ అనగానే చక్కని ఇల్లు, కారు, సకల సదుపాయాలు ఉన్న జీవితం గడుపుతుంటారని అందరం ఊహిస్తాం. కానీ అందుకు భిన్నంగా కరెంట్ లేకుండా జీవిస్తున్నారు మహారాష్ట్రలోని పుణెకు చెందిన డాక్టర్ హేమాసానె. ఆధునిక జీవనశైలికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఆమె జీవనం సాగిస్తున్నారు. 82 ఏళ్లుగా విద్యుత్ అవసరం లేకుండానే ఆనందంగా గడిపేస్తున్నారు.
'కరెంట్ లేకపోయినా పర్లేదు'
వృక్షశాస్త్ర విశ్రాంత ప్రొఫెసర్ అయిన హేమకు ప్రకృతి, పర్యావరణం అంటే అమితమైన ఇష్టం. ఆమె ఇంటి ప్రాంగణమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రకృతిపై హేమకు ఉన్న ప్రేమే.. కరెంట్ అవసరం లేకుండా జీవించేలా చేసింది. తాను విద్యుత్ లేకున్నా జీవించగలను కానీ పెంపుడు జంతువులు లేకుండా మాత్రం బతకలేను అని చెబుతున్నారామె.
"నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే జీవిస్తున్నాను. గత 82 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. అప్పటి నుంచి ఈ పరిసరాల్లోనే ఆనందంగా జీవనం సాగిస్తున్నాను. నాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. అందరూ కరెంట్ లేకుంటే బతకలేరు. నేను మాత్రం విద్యుత్ లేకున్నా ఉండగలను. కానీ పిల్లులు, పెంపుడు కుక్కలు లేకుండా మాత్రం జీవించలేను."
-హేమా సానె, మాజీ ప్రొఫెసర్
'ఎలక్ట్రిక్ వస్తువులు వాడను'
82 Year woman Living Without Electricity : పచ్చని మొక్కలు, వివిధ రకాల పక్షులు చుట్టూ ఉన్న ఓ చిన్న ఇంట్లోనే హేమాసానె ఉంటున్నారు. వృక్షశాస్త్ర నిపుణురాలు అయి ఉండి కూడా ఇంట్లో కరెంట్‌తో పనిచేసే ఎటువంటి పరికరాలు వాడడం లేదని ఆమె చెబుతున్నారు.
"టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్.. వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంట్లో ఉపయోగించడం లేదు. ఇవే కాకుండా కరెంట్‌తో పనిచేసే ఎటువంటి వస్తువులనూ వాడటం లేదు. విద్యుత్‌తో పనిచేసే పరికరాలు లేకపోయినా కూడా జీవనం సాగించగలను"
- హేమా సానె, విశ్రాంత ప్రొఫెసర్
ఆదర్శవంతమైన జీవనం..
ఆధునిక సమాజంలో విలాసవంతమైన జీవనం కోసం అంతా విద్యుత్‌తో పని చేసే వస్తువులనే వాడుతున్నారు. ఇలాంటి రోజుల్లో ఇంకా హేమా సానె లాంటి వారు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు.
పుడమికి పునరుజ్జీవం జీవజాలానికి అభయం
Kishan Reddy Speech At UN Event : 'ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ దిశగా మరిన్ని చర్యలు'