ETV Bharat / bharat

'ప్రైవేటు ఆసుపత్రులపై పార్లమెంటరీ కమిటీ మండిపాటు'

కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరించిన తీరుపై పార్లమెంటరీ కమిటీ మండిపడింది. ఈ మేరకు ఉపరాష్ట్రపతికి ఓ నివేదికను సమర్పించింది. కొవిడ్​ను​ ఎదుర్కోవడంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని తెలిపింది.

PAR-COVID
'ప్రైవేటు ఆసుపత్రులు విపరీతంగా వసూలు చేశాయి'
author img

By

Published : Nov 21, 2020, 8:27 PM IST

తక్కువ ధరకే కొవిడ్​ చికిత్స అందించి ఉంటే మృతుల సంఖ్య చాలా మేరకు తగ్గేదని పార్లమెంట్​ ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొంది. కరోనా కేసులు విపరీతంగా పెరగడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు తక్కువగా ఉండడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో విపరీతంగా ఫీజులు కట్టించుకోవడం వంటి అంశాలపై నివేదిక సమర్పించింది.

ఈ మేరకు.. పార్లమెంటరీ కమిటీ ఛైర్​పర్సన్ రామ్​ గోపాల్ యాదవ్​ 'కొవిడ్​-19 వ్యాప్తి దాని పరిణామాలు' అనే పేరుతో తయారు చేసిన నివేదికను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు సమర్పించారు.

అందరికీ సమానమే..!

కొవిడ్​ను ఎదుర్కోవడంలో భారతీయులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని పార్లమెంటరీ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. మొత్తంగా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని సూచించింది.

పెరుగుతోన్న కొవిడ్​-19 బాధితులకు చికిత్స అందించేందుకు దేశంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, అందులో ఉన్న మౌలిక వసతులు సరిపోవని నిర్ధరించింది. ప్రత్యేక నియమాలు లేని కారణంగా ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి విపరీతంగా డబ్బులు వసూలు చేశాయని వెల్లడించింది.

ఆరోగ్య రక్షణ.. డబ్బు ఉన్న వారికోసమే కాదని అందరికీ అది సమానంగా కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని నివేదిక స్పష్టం చేసింది. కరోనాతో పోరాటంలో భాగంగా ప్రాణాలు విడిచిన డాక్టర్ల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని కోరింది.

ఇదీ చదవండి:భారత్‌లో ప్రతి కోటి టెస్ట్‌లకు ఎన్ని రోజులు పట్టిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.