ETV Bharat / bharat

'జూన్ 21 నుంచి అందరికీ ఉచితంగా టీకా' - వ్యాక్సినేషన్​ బాధ్యతను తీసుకున్న కేంద్రం

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కేంద్రమే అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించి, జూన్​ 21 నుంచి సరికొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించారు.

narendra modi
నరేంద్ర మోదీ
author img

By

Published : Jun 7, 2021, 5:37 PM IST

Updated : Jun 7, 2021, 7:29 PM IST

వయోజనులందరికీ టీకా ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. టీకాలు వేసే బాధ్యతను పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని తెలిపారు. వ్యాక్సిన్​ కొనుగోలుకు అయ్యే ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నెల 21 నుంచి ఉచిత టీకా ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

"ఉత్పత్తిదారుల నుంచి టీకాలు కొని రాష్ట్రాలకు అందిస్తాం. టీకాల భారం నుంచి రాష్ట్రాలకు పూర్తి విముక్తి కలిగిస్తాం. వ్యాక్సిన్​ల కోసం రాష్ట్రాలు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సొంత ఖర్చుతో టీకా వేసుకునే వారికి ప్రైవేటు రంగంలో అవకాశం కల్పించాం. ఇందుకుగాను ఆయా ఆసుపత్రులు సర్వీస్ ఛార్జి రూ.150 వసూలు చేయవచ్చు. టీకాల ఉత్పత్తిలో 25 శాతం ప్రైవేటు రంగంలో అందుబాటులో ఉండనున్నాయి."

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

దేశంలో ప్రస్తుతం 7 కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మరో 3 కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. చిన్నారుల టీకా కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ముక్కు ద్వారా వేసే టీకా కోసం ప్రయోగాలు ఊపందుకున్నట్లు పేర్కొన్నారు.

నవంబరు నాటికి 80శాతం మంది టీకా..

నవంబరు నాటికి 80 శాతం మందికి టీకాలు ఇస్తామని ప్రధాని తెలిపారు. రాబోయే మరి కొద్ది రోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తునట్లు పేర్కొన్నారు. కొద్ది నెలల్లో భారీ సంఖ్యలో టీకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇతర దేశలతో పోల్చితే మనం వెనుకంజలో లేమని స్పష్టం చేశారు.

దీపావళి వరకు వారికి ఉచిత రేషన్..

గరీభ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్​ పథకాన్ని దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్​లో మే, జూన్​కు అమలు చేసిన ఈ పథకాన్ని ఇకపై దీపావళి వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 'వ్యాక్సినేషన్​లో ఆత్మనిర్భరత చాటిన భారత్'

Last Updated : Jun 7, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.