ETV Bharat / bharat

జల్​ జీవన్ మిషన్ యాప్​ను ఆవిష్కరించిన మోదీ

author img

By

Published : Oct 2, 2021, 12:06 PM IST

జల్​ జీవన్ మిషన్ యాప్​ను (Jal Jeevan Mission app) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దేశంలోని పలు గ్రామ పంచాయతీలు, పారిశుద్ధ్య కమిటీ సభ్యులతో మాట్లాడారు. రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.

pm modi jal jeevan mission
జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో మోదీ

జల్ జీవన్ మిషన్​లో (Jal Jeevan Mission) భాగంగా దేశం​లోని గ్రామ పంచాయతీలు, పారిశుద్ధ్య కమిటీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో.. జల్​ జీవన్ మిషన్ యాప్​ను (Jal Jeevan Mission app) ఆవిష్కరించారు. ఈ పథకం కింద అమలు చేస్తున్న కార్యక్రమాల పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ యాప్ దోహదపడనుందని ప్రధాని కార్యాలయం తెలిపింది.

pm modi jal jeevan mission
జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో మోదీ

అదేసమయంలో రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు మోదీ. దీని ద్వారా దేశంలోని గ్రామీణ నివాసాలు, పాఠశాలలు, అంగన్​వాడి సెంటర్లు, ఇతర ప్రభుత్వ సంస్థలకు నల్లా నీరు అందించేందుకు సహకారం అందించవచ్చు. దేశ, విదేశాల్లోని వ్యక్తులు, సంస్థలు ఈ కార్యక్రమం ద్వారా చేయూత అందించవచ్చు.

దేశమంతటా గ్రామసభలు

జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Scheme) కార్యక్రమంపై శనివారం దేశవ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. గ్రామంలోని నీటి పారుదల వ్యవస్థ, నిర్వహణ, ప్రణాళికలపై గ్రామ సభలు చర్చించనున్నట్లు వెల్లడించింది.

జల్ జీవన్ మిషన్ వివరాలు

2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని మోదీ ప్రకటించారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందించేలా లక్ష్యం పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ పథకంపై ప్రకటన చేసిన సమయంలో 3.23 కోట్ల గృహాలకు మాత్రమే నల్లా నీరు అందుబాటులో ఉంది. గత రెండేళ్లలో ఐదు కోట్లకు పైగా ఇళ్లకు నీటి కనెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం 8.26 కోట్ల (43 శాతం) గృహాలకు ఇంటి వద్దే నల్లా సదుపాయం ఉంది. 7.72 లక్షల (76 శాతం) పాఠశాలలు, 7.48 లక్షల (67.5 శాతం) అంగన్​వాడీ కేంద్రాలకు మంచి నీటి సరఫరా సదుపాయం ఏర్పాటైంది. రాష్ట్రాలతో కలిసి రూ. 3.60 లక్షల కోట్ల బడ్జెట్​తో దీన్ని అమలు చేస్తున్నట్లు పీఎంఓ తెలిపింది. అదనంగా రూ. 1.42 లక్షల కోట్లు పంచాయతీ రాజ్ సంస్థలకు కేటాయించినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: మహాత్మా గాంధీకి ప్రముఖుల నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.