దిల్లీలో కొత్తగా రక్షణ కార్యాలయ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi news) ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం కార్యాలయ సముదాయాన్ని మోదీ(PM Modi news) పరిశీలించారు. ఈ క్రమంలోనే త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మాట్లాడారు.


ఈ ప్రారంభోత్సవానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(defence minister of india), సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్(CDS Bipin Rawat), కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ (PM Modi news), ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే (army chief of India) సహా పలువురు హాజరయ్యారు.

కొత్త రక్షణ కార్యాలయ సముదాయంలో(PM Modi news) సైనిక, నౌక, వైమానిక దళాల అధికారులు సహా రక్షణ మంత్రిత్వశాఖ సిబ్బంది ఉంటారు. దీనిని 7,000 మంది బస చేసేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ భవనాలు.. సురక్షిత, క్రియాశీలక పని ప్రదేశాలుగా మారనున్నాయి.

ఈ భవనాల కార్యకలాపాల నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ స్థాపించారు. అలాగే భవనాల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: 'మన్ కీ బాత్' కోసం సలహాలు ఇవ్వండి: మోదీ