ETV Bharat / bharat

'ఏకాభిప్రాయమే మా ప్రభుత్వ మంత్రం' - దీన్​దయాల్​ ఉపాధ్యాయ వర్ధంతి

భాజపా సిద్ధాంతకర్త దీన్​దయాళ్ ఉపాధ్యాయ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీన్​దయాళ్​ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం భాజపా ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. రాజకీయ అంటరానితనాన్ని తమ పార్టీ నమ్మదని, ఏకాభిప్రాయానికే విలువ ఇస్తుందన్నారు మోదీ. జాతీయవాదానికే తమ తొలి ప్రాధాన్యమన్నారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని పార్టీ ఎంపీలకు సూచించారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Feb 11, 2021, 11:30 AM IST

Updated : Feb 11, 2021, 1:40 PM IST

రాజకీయ అంటరానితనాన్ని భారతీయ జనతా పార్టీ నమ్మదని నొక్కిచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశాన్ని నడిపించేందుకు ఏకాభిప్రాయానికి విలువ ఇస్తామన్నారు. దేశానికి చేసిన సేవలను గుర్తించే విషయంలో రాజకీయ ప్రత్యర్థులను కూడా పురస్కారాలతో తమ ప్రభుత్వం గౌరవించినట్లు గుర్తు చేశారు.

Deendayal Upadhyay's death anniversary
దీన్​దయాళ్​కు నివాళులర్పిస్తున్న మోదీ, నడ్డా

భారతీయ జన సంఘ్​ నాయకుడు, భాజపా సిద్ధాంతకర్త దీన్​దయాళ్​ ఉపాధ్యాయ 53వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు మోదీ. ఆయనతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. దయాళ్ జీవితం, ఆయన సంకల్పం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

" భాజపా ఎప్పుడూ రాజకీయంకన్నా జాతీయవాదానికే ప్రాధాన్యం ఇస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవిస్తుంది. మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్​ సీనియర్​ నేత ప్రణబ్​ ముఖర్జీని భారత రత్నతో గౌరవించుకున్నాం. అసోం మాజీ సీఎం తరుణ్​ గొగొయి, నాగాలాండ్​ మాజీ సీఎం ఎస్​సీ జమిర్​కు పద్మ అవార్డులు ఇచ్చాం. ప్రభుత్వం మెజారిటీతో నడుస్తుంది. కానీ దేశం ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగుతుంది. ఉపాధ్యాయ ఆలోచనలైన అంత్యోదయ, మానవతావాదాలే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పనులకు స్ఫూర్తి. ఆత్మనిర్భర్​ భారత్​ కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. విదేశీ విధానాల్లో దేశానికే మొదటి ప్రాధాన్యం అనే నియమాన్ని భారత్​ పాటిస్తుంది.

దీన్​దయాళ్​ ఉపాధ్యాయ ఎప్పుడూ మనకు స్ఫూర్తిదాయకం. నేటికీ ఆయన ఆలోచనలు మనతోనే ఉన్నాయి. ఎప్పటికీ కొనసాగుతాయి. అధికారంతో గౌరవం అంతంతమాత్రమే. కానీ మనలోని విలువలతో వచ్చే గౌరవం అనంతం. అందుకు దీన్​దయాళ్​ ఉదాహరణ. 1965లో భారత్​-పాక్​ యుద్ధ సమయంలో విదేశీ ఆయుధాలపై భారత్​ ఆధారపడింది. భారత్​ వ్యవసాయంతో పాటు రక్షణ రంగం, ఆయుధాల తయారీలోనూ స్వయం సమృద్ధిగా మారాలని దీన్​దయాళ్​ ఆనాడే చెప్పారు. ప్రస్తుతం దేశంలో రక్షణ కారిడార్ల ఏర్పాటు, మేడ్​ ఇన్​ ఇండియా ఆయుధాలు, తేజస్​ వంటి యుద్ధ విమానాలు తయారవుతున్నాయి "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న భాజపా విభాగాలు.. 75 సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు మోదీ. పార్టీ ఎంపీలు, ఇతర నేతలు తమ రోజువారీ జీవితంలో వినియోగిస్తున్న వస్తువుల జాబితా తయారు చేయాలని, అందులో ఏవైనా విదేశీ వస్తువులు ఉంటే వాటి స్థానంలో స్వదేశీ వస్తువులను వాడాలని సూచించారు.

ఇదీ చూడండి: 'బలగాల ఉపసంహరణపై భారత్​- చైనా ఏకాభిప్రాయం'

Last Updated : Feb 11, 2021, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.