ETV Bharat / bharat

ట్విట్టర్​లో ప్రధాని మోదీనే నెంబర్​వన్​! - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ట్విట్టర్​ ఖాతా తొలగింపుతో క్రియాశీల నేతల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి స్థానానికి వచ్చారు. ప్రధాని మోదీకి 6.47 కోట్ల మంది ట్విట్టర్​ ఫాలోవర్లు ఉన్నారు.

PM Modi
ట్విట్టర్​లో ప్రధాని మోదీనే నెంబర్​వన్​
author img

By

Published : Jan 11, 2021, 5:30 AM IST

ట్విట్టర్​లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్ర స్థానంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన్ను 6.47 కోట్ల మంది అనుసరిస్తున్నారు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 8.87 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు. వాషింగ్టన్​లోని క్యాపిటల్​ భవనంపై ట్రంప్​ మద్దతుదారుల దాడి అనంతరం ఆయన ఖాతాను ట్విట్టర్​ శాశ్వతంగా తొలిగించింది. దీంతో మోదీకి మొదటి స్థానం దక్కింది.

PM Modi
ట్విట్టర్​లో మోదీ

క్రియాశీలంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతున్నారు. ఒబామాకు 12.79 కోట్ల మంది ట్విట్టర్​లో అనుసరిస్తున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు ప్రస్తుతం 2.33 కోట్ల మంది ట్విట్టర్​ ఫాలోవర్లు ఉన్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​ ట్విట్టర్​ ఖాతాపై శాశ్వత నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.