2021 ఏడాదికి గానూ పద్మ పురస్కారాలను (Padma awards 2021) ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మ అవార్డు గ్రహీతలకు.. పురస్కారాలు (Padma awards 2021) అందించారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం ప్రకటించిన దేశంలోనే రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందజేసింది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ అవార్డును స్వీకరించారు.
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ సాహూ.. పద్మవిభూషణ్ (Padma vibhushan 2021) పురస్కారాన్ని అందుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ పద్మభూషణ్ (Padma bhushan 2021) అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు.
![PADMA AWARDS 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13582368_fduqbm6ucaetsxp-1.jpg)
![PADMA AWARDS 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13582368_fduqbm6ucaetsxp-3.jpg)
అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయి తరపున ఆయన భార్య పద్మభూషణ్ స్వీకరించారు. లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత రాంవిలాస్ పాసవాన్ తరపున ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్.. పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
![PADMA AWARDS 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13582368_fduqbm6ucaetsxp-4.jpg)
![PADMA AWARDS 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13582368_fduqbm6ucaetsxp-2.jpg)
మొత్తం 119...
2021 సంవత్సరానికి 199 మందికి పద్మ అవార్డులు లభించాయి. ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి మరణానంతరం అవార్డు వరించింది. ఒక ట్రాన్స్‌జెండర్‌కు అవార్డుకు ఎంపికయ్యారు.
ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జపాన్ మాజీ ప్రధాని షింజో అబెలను పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం.
కరోనాతో ఆలస్యం..
2020 ఏడాదికి సంబంధించిన అవార్డులను సోమవారం ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కరోనా కారణంగా 2020లో ప్రదానోత్సవం నిర్వహించలేకపోయారు.
ఇదీ చదవండి: పద్మ అవార్డుల ప్రదానోత్సవం- మోదీ సహా ప్రముఖులు హాజరు