రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. అయితే మరిన్ని పరీక్షల కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించింది.
శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురైన కోవింద్... దిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.