ETV Bharat / bharat

'న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర పెరగాలి'

author img

By

Published : Oct 3, 2021, 7:58 AM IST

న్యాయ వ్యవస్థలో మహిళల పాత్రను పెంచాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. న్యాయసేవలపై జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ(నల్సా) మాతృ భాషల్లో ప్రచారం చేపట్టడాన్ని ఆయన అభినందించారు. మరోవైపు.. న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి.రమణ పేర్కొన్నారు.

nalsa campaign
జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ

న్యాయ వ్యవస్థలో మహిళల పాత్రను పెంచాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. 'మహిళల అభివృద్ధి' దశ నుంచి 'మహిళల ద్వారా అభివృద్ధి' స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ (నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ-నల్సా) 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆరు వారాలపాటు దేశవ్యాప్తంగా చేపట్టనున్న ప్రజాచైతన్య కార్యక్రమాలను ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

"న్యాయ ప్రక్రియలో మహిళలకు ప్రమేయం ఉండేలా నల్సా కృషి చేస్తోంది. న్యాయ సేవా కేంద్రాల ద్వారా ఎక్కువ మంది మహిళలే లబ్ధి పొందుతున్నందున ఈ ప్రక్రియలో మహిళా న్యాయవాదుల పాత్రను పెంచాలి. న్యాయవాదిగా మహాత్మాగాంధీ పేదలకు ఉచితంగా సేవలు అందించారు. సీనియర్‌ న్యాయవాదులు కూడా ఈ మార్గాన్ని అనుసరించాలి. మాతృ భాషలతోనే ప్రజలకు న్యాయం మరింత చేరువవుతుంది. నల్సా కార్యాచరణ ప్రణాళిక, అవగాహన ప్రచార సామగ్రి మాతృభాషల్లో ఉండడం హర్షణీయం."

-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

'సమాన న్యాయంతోనే సమ్మిళిత అభివృద్ధి'

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య నాణ్యత న్యాయ వ్యవస్థ నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చైతన్యవంతమైన న్యాయవ్యవస్థ ఉండాలని తెలిపారు.

"సమ్మిళిత అభివృద్ధితోనే సుస్థిరమైన, చైతన్యశీల ప్రజాస్వామ్యం సాధ్యమన్నది విస్మరించలేని సత్యం. అందరికీ సమానస్థాయిలో న్యాయం అందుబాటులోకి రాకపోతే సమ్మిళిత వృద్ధి సాధ్యంకాదు. సమాజంలోని దుర్భల వర్గాల హక్కులకు రక్షణ కల్పించలేకపోతే సమన్యాయ సిద్ధాంతానికి విలువ ఉండదు. న్యాయ సహాయం అవసరం ఉన్నవారు మన దగ్గరకు రాలేని పరిస్థితి ఉంటే మనమే వాళ్ల దగ్గరకు వెళ్లాలన్న సిద్ధాంతంతో ఇప్పుడు న్యాయచైతన్య కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తి చేస్తే సత్వర న్యాయం అందుతుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నాను."

-జస్టిస్​ ఎన్‌.వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

స్వతహాగా న్యాయవాది అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యాయ సంస్కరణలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని జస్టిస్‌ రమణ కొనియాడారు. తీర్పులన్నీ ప్రాంతీయభాషల్లో ఉండాలని ఆకాంక్షించిన మొదటి వ్యక్తి ఆయనేనని పేర్కొన్నారు. దేశంలోని వివిధ హైకోర్టులకు జడ్జీలుగా 106 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసిందని తెలిపారు. రెండు మూడు రోజుల్లో నియామకాలు పూర్తి చేస్తామని కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

'సత్వర న్యాయం ప్రజల ఆకాంక్ష'

తగిన వ్యయంలో సత్వర న్యాయం పొందడం ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్ష అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు. వాణిజ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలైన మార్గమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నల్సా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ యు.యు.లలిత్‌, సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ ప్రసంగించారు.

ఇదీ చూడండి: CJI of India: 'సమన్యాయం కోసం ప్రభుత్వ సహకారం అవసరం'

ఇదీ చూడండి: 'వారిని న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.