ETV Bharat / bharat

'మిగతా వారిలా పాదయాత్రలో సెలవులు తీసుకోను.. ఇంటికి వెళ్లను'.. రాహుల్​పై PK వ్యాఖ్యలు! - Prominent strategist Prashant Kishore

సొంత రాష్ట్రం బిహార్​లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్​ కిశోర్.. రాహుల్​ గాంధీ జోడోయాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్​ గాంధీని ఉద్దేశించి.. వారంతా పెద్ద వాళ్లని వాళ్లతో పోల్చవద్దని అన్నారు. తాను కొందరిలా పాదయాత్ర మధ్యలో ఇంటికి వెళ్లనని రాహుల్​ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.

Etv prashant-kishore-comments-on-rahul-gandhi-jodoyatra-in-bihar
రాహుల్ గాంధీ​ జోడోయాత్రపై ప్రశాంత్​ కిశోర్ వ్యాఖ్యలు
author img

By

Published : Jan 8, 2023, 2:03 PM IST

వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్​ కిశోర్..​ రాహుల్​ గాంధీ జోడోయాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'వారంతా పెద్ద వాళ్లు అని వాళ్లతో పోల్చవద్దు' అని అన్నారు. బిహార్​లో​ పాదయాత్ర చేస్తున్న ఆయన రాహుల్​ గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 'మీ పాదయాత్రతో రాహుల్​ గాంధీ జోడో యాత్రను పోల్చవచ్చా' అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ప్రశాంత్​ కిశోర్ ఈ విధంగా బదులిచ్చారు.

ప్రశాంత్​ కిశోర్​ను అవకాశవాదిగా పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. నిస్వార్థంగా పాదయాత్రను చేస్తున్నట్లు తెలిపారు. "రాహుల్​ గాంధీ 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. నాకు దూరంతో పని లేదు. అక్టోబర్ నుంచి​ ఆగకుండా నడుస్తున్నాను. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు సాక్ష్యంగా దీన్ని చూపించడం నాకు ఇష్టం లేదు. ఇది ఛట్ పండుగ తపస్సు లాంటిది. కొందరు ఆ తపస్సులో నీరు తాగవచ్చు. నిజమైన భక్తులు అలా చేయరు. 36 గంటల పాటు కఠినమైన ఉపవాసాన్ని పూర్తి చేయకుండా ఉండరు. మిగతా వారిలా నేను న్యూ ఇయర్​కు, చిన్నచిన్న వాటికి సెలవు తీసుకోను. ఇంటికి కూడా వెళ్లను. నా లక్ష్యం చాలా పెద్దది. దాన్ని చేరేందుకే నేను కృషి చేస్తున్నాను" అని ప్రశాంత్​ కిశోర్ అన్నారు.

గతంలో కాంగ్రెస్​ పార్టీలో చేరాలని భావించిన ప్రశాంత్​ కిశోర్​.. వివిధ కారణాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. జన్ సురాజ్ పేరిట ఆయన పాదయాత్ర చేస్తున్నారు. గతేడాది అక్టోబర్​ 2న పాదయాత్ర పారభించారు. ప్రస్తుతం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహరిలో ప్రశాంత్​ కిశోర్​ పాదయాద్ర సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.