Pranab Mukherjee On Rahul Gandhi : గాంధీ-నెహ్రూ కుటుంబాల వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాజకీయ చతురత మాత్రం వారసత్వంగా అబ్బలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నట్లు ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ప్రణబ్ జీవించి ఉన్న రోజుల్లో చెప్పిన విషయాలు, ఆయన డైరీలోని కొన్ని అంశాలు, ఆయన రాజకీయ జీవితాన్ని అధ్యయనం చేసి 'ప్రణబ్- మై ఫాదర్-ఏ డాటర్ రిమెంబర్స్' పేరుతో పుస్తకం రాశారు. నెహ్రూ -గాంధీ కుటుంబం పట్ల ప్రణబ్‌కు ఉన్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్ రాజకీయ భవిష్యత్తు, ప్రధాని పదవిపై ఆయనకు ఉన్న మక్కువతోపాటు రాజకీయాలకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని పలు అంశాలను శర్మిష్ఠ మీడియాతో పంచుకున్నారు.
ప్రశ్న: మీ పుస్తకంలోని చాలా అంశాలపై చర్చ జరుగుతోంది. వాటిని మీరెలా చూస్తారు?
శర్మిష్ఠ ముఖర్జీ: నా తండ్రి (ప్రణబ్) 50ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. సహజంగా ఆయన గురించి రాస్తే ఆయన డైరీలో అంశాలు, నేను ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలను కోట్ చేస్తూ రాస్తే కొన్ని అంశాలు వివాదాస్పదం అవుతాయి. అది పెద్ద విషయమేమీ కాదు. రాజకీయ రంగమే అలాంటిది. వివాదాలను తొందరగా సృష్టిస్తారు.
ప్రశ్న: ఇంకో వివాదం AM, PM ఏ సమయంలో జరిగింది?
శర్మిష్ట ముఖర్జీ: ఒకరోజు రాహుల్‌గాంధీ మా నాన్న(ప్రణబ్)ను కలిసేందుకు వచ్చారు. నాన్న(ప్రణబ్) అప్పుడు మొఘల్ గార్డెన్‌లో వాకింగ్ చేస్తున్నారు. అప్పుడు కలిశారు. నాన్న(ప్రణబ్)ను రాహుల్‌గాంధీ సాయంత్రం కలవాల్సి ఉందని తర్వాత తెలిసింది. రాహుల్ కార్యాలయం ఆయనకు సాయంత్రానికి బదులు ఉదయం అని పొరపాటున సమాచారం ఇచ్చింది. నాకు ఏడీఎస్ ద్వారా ఈ విషయం తెలిసింది. నేను ఆ విషయాన్ని నాన్న(ప్రణబ్)కు చెప్పాను. రాహుల్ గాంధీ కార్యాలయానికి AM, PM మధ్య తేడా తెలియకుంటే వారు ఒకరోజు పీఎంవో కార్యాలయాన్ని నడిపిస్తారని ఎలా అనుకుంటామని నాన్న (ప్రణబ్) కొంత వ్యంగ్యంగా అన్నారు.
'రాహుల్ గాంధీ చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. అనేక ప్రశ్నలు వేస్తారు. కానీ, రాజకీయాల్లో ఆయన పరిణితి సాధించలేదు. 2013 జులైలో రాహుల్ ఓ సారి మా ఇంటికి వచ్చారు. పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన ప్రణాళికలను చెప్పారు. ఆయన సవాళ్లను ఎదుర్కోగలరని అనిపించింది. అయితే, ముందు కేబినెట్‌లో చేరి పాలనాపరమైన అంశాల్లో అనుభవం గడించాలని చెప్పా. కానీ నా సలహాను ఆయన వినిపించుకోలేదు' అని ప్రణబ్ నాటి సంగతులను తన డైరీలో రాసుకున్నారు.
'మోదీ వల్లే టీమ్ఇండియా ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది'- రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్