ETV Bharat / bharat

బంగాల్​లో రాజకీయ హింస.. ముగ్గురు మృతి - bengal violence after election

బంగాల్​లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు భాజపా చెందిన వారు కాగా మరో వ్యక్తి ఐఎస్ఎఫ్​ కార్యకర్త.

bengal violence after election, 3 dead in violence bengal
బంగాల్​లో హింస.. ముగ్గురు మృతి
author img

By

Published : May 3, 2021, 3:05 PM IST

బంగాల్​ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. వేర్వేరు ఘటనల్లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు భాజపాకు చెందిన వారు కాగా మరోవ్యక్తి ఐఎస్​ఎఫ్​ సభ్యుడని పోలీసులు గుర్తించారు.

దక్షిణ 24 పరగణాలు జిల్లా సోనార్​పుర్​ ప్రాంతంలో హరణ్​ అధికారి అనే భాజపా కార్యకర్త హత్యకు గురయ్యాడు. తృణమూల్​ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కోల్​కతాలోని బెలెఘటా ప్రాంతంలో అభిజిత్​ సర్కార్​ అనే భాజపా కార్యకర్తను దుండగులు ఆదివారం రాత్రి హత్యచేశారు.

ఉత్తర 24 పరగణాలు జిల్లా దత్తపుకుర్​లో దుండగులు జరిపిన బాంబు దాడిలో ఐఎస్ఎఫ్​ కార్యకర్త హన్సుర్​ రెహమాన్​ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది తృణమూల్ కాంగ్రెస్​ నేతల పనే అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి : బంగాల్​ ఉత్తర 24 పరగణాల్లో పేలుడు పదార్థాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.