ETV Bharat / bharat

Ponguleti and Jupally: 'సీఎం కేసీఆర్​ను గద్దె దించడమే లక్ష్యం.. ప్రస్తుతానికి..' - వేడెక్కిన ఖమ్మం రాజకీయం

Ponguleti and Jupally Latest Comments: బీజేపీలోకి రమ్మని ఆ పార్టీ నేతలు ఆహ్వానించినప్పటికీ.. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్​ఎస్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా.. బీజేపీ నేతలతో చర్చలు జరిగాయన్న నేతలు.. యావత్‌ తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు జూపల్లి, పొంగులేటితో జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ను ఓడించగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందని పునరుద్ఘాటించారు.

Ponguleti
Ponguleti
author img

By

Published : May 4, 2023, 8:31 PM IST

Updated : May 4, 2023, 9:28 PM IST

Ponguleti and Jupally Latest Comments: బీఆర్​ఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ గూటికి చేర్చేందుకు బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కమలం అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్‌షా ఆదేశాల మేరకు ఖమ్మంలో పొంగులేటి నివాసంలో జూపల్లి కృష్ణారావు, శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఐదు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరికపై మథనం చేశారు.

కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించడమే ధ్యేయం: ఈ సందర్భంగా బీజేపీలోకి రమ్మని ఆ పార్టీ నేతలు ఆహ్వానించినప్పటికీ.. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి సమావేశాలు చాలా జరుగుతాయని.. ఇది మొదటిదేనన్న పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి.. తెలంగాణ ప్రజల అందరి మనోభావాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించడమే అందరి ఉమ్మడి ధ్యేయమన్న నేతలు.. అందుకు తగ్గ సరైన మార్గాన్ని అనేక సంప్రదింపుల తర్వాత ఎంచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

'తెలంగాణ రాష్ట్రమొస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆశయాన్ని సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు. వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించే అంశంలో అందరం ఏకం కావాలి. ఇదే విషయాన్ని అనేక వేదికలపై చెప్పాను. బీజేపీ ముఖ్య నాయకులతో చర్చల సందర్భంగా కూడా ఇదే విషయం చెప్పాం. ఏ లక్ష్యంతో తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలని బీఆర్​ఎస్​ నుంచి బయటికొచ్చామో.. ఆ ఆశయం నెరవేర్చే క్రమంలోనే ఈనాటి సమావేశం. భవిష్యత్‌లో జరగబోయే సమావేశాలు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి.'- పొంగులేటి

ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. 'అమరవీరుల ఆత్మలు శాంతించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం దక్కకుండా చూడాలి. దానికి ఉన్న మార్గాలను చెప్పారు. ఇవాళ్టి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, సంస్థలు, ఉద్యమకారులు, కళాకారులందరినీ సంఘటితం చేసి.. లక్ష్య సాధన కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తాం. బీజేపీ ముఖ్య నేతలకు మేం చెప్పాల్సింది చెప్పాం. వారు చెప్పేది చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా చాలా మందితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తాం. ప్రజలంతా సంఘటితం కావాలి'-జూపల్లి కృష్ణారావు

బీజేపీతో జూపల్లి, పొంగులేటి కలిసి వస్తారనే విశ్వాసం ఉంది: జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ వెల్లడించారు. అమిత్‌షా, నడ్డా ఆదేశాల మేరకు పొంగులేటి, జూపల్లిని కలిశామన్న ఈటల.. అందరి ఉమ్మడి లక్ష్యం బీఆర్​ఎస్​ సర్కార్‌ను ఇంటికి సాగనంపడమేనన్నారు. ప్రస్తుతం కేసీఆర్​ను ఢీకొట్టి బీఆర్​ఎస్ సర్కార్‌ను ఇంటికి సాగనంపగల సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఈటల రాజేందర్‌ పునరుద్ఘాటించారు. అంతిమంగా బీజేపీతో జూపల్లి, పొంగులేటి కలిసి వస్తారనే విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను గద్దె దించడం కోసం అందరం ఏకం కావాలి: పొంగులేటి

ఇవీ చదవండి:

Last Updated : May 4, 2023, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.