ETV Bharat / bharat

'కాలుష్య నియంత్రణ చర్యలు పాటిస్తున్నారా?' - దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ

sc on pollution in delhi: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌తో సహా నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను ఏ మేరకు పాటిస్తున్నారో తెలపాలని దిల్లీ, ఎన్‌సీఆర్​ రాష్ట్రాలను కోరింది.

sc on pollution aqi in delhi
కాలుష్యంపై సుప్రీంకోర్టు తీర్పు
author img

By

Published : Nov 29, 2021, 4:35 PM IST

sc on pollution in delhi: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌తో సహా నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను ఏ మేరకు పాటిస్తున్నారో తెలపాలని దిల్లీ, ఎన్‌సీఆర్ రాష్ట్రాలను కోరింది. ఒకవేళ పాటించలేకపోతే దానికి సంబంధించి అఫిడవిట్​లను బుధవారం సాయంత్రంలోగా దాఖలు చేయాలని ఆదేశించింది.

"కాలుష్యంపై కమిటీ ఇచ్చిన సూచనలు మంచివి. కానీ ఫలితం శూన్యం. ఉల్లంఘించినవారికి రూ.1000 జరిమానా విధించడం లేదా ఒక రోజు జైలు శిక్ష విధించడం వంటి చర్యలు పని చేయట్లేవు. కాలుష్యాన్ని ఎలా అరికట్టాలని మనం పోరాడుతున్నాము. మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు. మాకు అన్నీ తెలుసు. పిటిషన్​లో కొన్ని అంశాలను దాటవేసి ప్రధాన సమస్యని దారి మళ్లించే ప్రయత్నం చేయవద్దు."

- సుప్రీంకోర్టు ధర్మాసనం

సెంట్రల్ విస్టా వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాలు శరవేగంగా సాగుతున్నాయని సీజేఐ జస్టిస్​ ఎన్​.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. అటువంటి ప్రాజెక్టులు పౌరుల జీవితాల కన్నా ముఖ్యమైనవి కావని విన్నవించారు.

ఇదీ చదవండి:'సాగు చట్టాల రద్దు' బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.