ETV Bharat / bharat

కొవిడ్‌ సూపర్‌ స్ప్రెడర్స్‌ అవే: ఎన్‌టీఏజీ - దేశంలో కరోనా మహమ్మారికి సూపర్​ స్ప్రెడర్స్​

ఏ చిన్న, పెద్ద సామూహిక కార్యక్రమమైన కరోనా మహమ్మారి ఉద్ధృతికి సూపర్‌ స్ప్రెడరేనని ఎన్‌టీఏజీ(జాతీయ ఇమ్యునేజేషన్‌ సాంకేతిక సలహా బృందం) ఛైర్మన్​ డాక్టర్​ ఎన్​కే ఆరోడా పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తిని పట్టించుకోకుండా కొంతమంది యువత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు.

corona super spreaders
కొవిడ్‌ సూపర్‌ స్ప్రెడర్స్‌
author img

By

Published : Apr 15, 2021, 9:25 AM IST

Updated : Apr 15, 2021, 10:37 AM IST

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తోంది. మునుపటి కంటే వేగంగా వృద్ధి చెందుతూ జనాల్లో భయ ప్రకంపనలు రేపుతోంది. బుధవారం ఒక్కరోజే దేశంలో అత్యధికంగా 2 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే.. ఇంతటి స్థాయిలో వైరస్‌ ఉగ్రరూపం దాల్చడంపై ఎన్‌టీఏజీఐ(జాతీయ ఇమ్యునేజేషన్‌ సాంకేతిక సలహా బృందం) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే ఆరోడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, రైతుల ఆందోళన వంటివి మహమ్మారి ఉద్ధృతికి సూపర్‌ స్ప్రెడర్స్‌ అని పేర్కొన్నారు. ఏ చిన్న, పెద్ద సామూహిక కార్యక్రమమైనా వైరస్‌ వ్యాప్తికి సూపర్‌ స్ప్రెడరేనని తేల్చిచెప్పారు. బుధవారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.

"కొవిడ్‌ వ్యాప్తిని పట్టించుకోకుండా కొంతమంది యువత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రూపులు కడుతూ పార్టీలు చేసుకుంటున్నారు. బహిరంగ సమావేశాలతో సహా వీటన్నింటిని ఆపకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మరే అవకాశం లేకపోలేదు."

-డాక్టర్‌ ఎన్‌కే ఆరోడా, ఎన్‌టీఏజీఐ ఛైర్మన్‌

కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు విధించుకోవచ్చని, అయితే దేశ వ్యాప్త లాక్‌డౌన్‌కు మాత్రం తాను అనుకూలం కాదని ఎన్‌కే ఆరోడా చెప్పారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో విధించిన 15 రోజుల పాక్షిక లాక్‌డౌన్‌ను ఆయన ఉదాహరణగా వివరించారు.

కాగా, దేశంలో బుధవారం ఒక్కరోజే 2,00,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 1,40,74,564కు చేరింది. ఇప్పటి వరకు 1,24,29,564 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. 1,73,123 మంది కరోనాతో మృత్యుఒడికి చేరారు.

ఇదీ చూడండి:శ్మశానాలకు కుప్పలుగా కొవిడ్​ మృతదేహాలు

ఇదీ చూడండి:రెమిడెసివిర్‌ ఔషధ ఉత్పత్తిని పెంచండి!

Last Updated : Apr 15, 2021, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.