ETV Bharat / bharat

Police Theft In Varanasi : పోలీసులే దొంగలు.. దెయ్యం కోసం దర్యాప్తు.. ఉద్యోగిని బెదిరించి రూ. 1.4 కోట్లు చోరీ

Police Theft In Varanasi Case : రూ.1.4 కోట్ల దోపిడీ కేసులో పరారీలో ఉన్న ఏడుగురు పోలీసులపై ఉత్తర్​ప్రదేశ్​.. వారణాసి కోర్టు నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది. ఇందులో స్టేషన్ ఇన్​ఛార్జ్​తో పాటు ముగ్గురు ఎస్​ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

Police Theft In Varanasi Case
Police Theft In Varanasi Case
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 11:22 AM IST

Updated : Sep 5, 2023, 12:45 PM IST

Police Theft In Varanasi Case : దెయ్యం దర్యాప్తు కోసం వచ్చి రూ.1.4 కోట్ల దోపిడీ చేసి పరారీలో ఉన్న ఏడుగురు పోలీసులపై ఉత్తర్​ప్రదేశ్​.. వారణాసి కోర్టు నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది. ఈ మేరకు జడ్జి శక్తి సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్టేషన్ ఇన్​ఛార్జ్​తో పాటు ముగ్గురు ఎస్​ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ఈ ఘటనపై వారణాసి జిల్లా భేలూపుర్ పోలీస్​ స్టేషన్​లో 12 మందిపై కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్​లో వారణాసి జిల్లాలో దెయ్యం సంచరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తెల్లటి వస్తువులు కదులుతున్నట్లు పలు వీడియోలు సైతం సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై వారణాసి జిల్లా భేలూపుర్ పోలీస్​ స్టేషన్ ఇన్​ఛార్జ్​ రమాకాంత్​ దుబే.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలపై కేసు కూడా నమోదు చేశామని.. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్​ను కూడా ముమ్మరం చేశామని అప్పట్లో దుబే చెప్పారు.

కట్​చేస్తే.. 2023 మే 29న దర్యాప్తు కోసం వెళ్లిన రమాకాంత్​ దుబే.. గుజరాత్​కు చెందిన ఓ వ్యాపారి కంపెనీ కార్యాలయానికి రెండు వాహనాలతో వెళ్లారు. గన్స్​తో బెదిరించి.. అందులో పని చేస్తున్న ఉద్యోగి విక్రమ్ సింగ్​ వద్ద నుంచి రూ. 1.4 కోట్లు దొంగతన చేశారు. ఈ చోరీలో దూబెకు పోలీసు సహచరులు సుశీల్​ కుమార్, ఉత్కర్ష్ చతుర్వేది, మహేశ్ కుమార్ సింగ్, మహేంద్ర కుమార్​, శివచంద్ర, కపిల్​దేవ్ పాండేలతో పాటు ప్రదీప్​ పాండే, వసీంఖాన్‌, ఘన్‌శ్యాం మిశ్ర, సచ్చిదానంద రాయ్ అలియాస్ మంటూ, అజీత్​ మిశ్రా సహాయం చేశారు.

ఈ ఘటనపై ఉద్యోగి విక్రమ్ సింగ్..​ మంటూ రాయ్​ అనే స్థానికుడితో పాటు మరికొంతమందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు గుజరాత్​కు చెందిన యజమాని కూడా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో 2023 మే 31న శంకుల్​ధార పోఖారా ప్రాంతంలో పార్క్ చేసిన మంటూకు చెందిన కారు నుంచి రూ.92.94 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు క్రియేట్​ చేశారు రమాకాంత్​ దుబే. అయితే మంటూని అరెస్ట్ చేసి విచారించగా దోపిడీలో పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు అంగీకరించాడు. ఈ విషయం తెలియడం వల్ల పోలీసులు పరారయ్యారు.

ముగ్గురు నిందితులు ప్రదీప్​ పాండే, వసీంఖాన్‌, ఘన్‌శ్యాం మిశ్రాలను జూన్‌ 6న, సచ్చిదానంద రాయ్​ అలియాస్ మంటూను జూన్​8న దిల్లీలోని కన్నాట్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో నిందితుడు అజీత్ మిశ్రాను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నప్పటికీ.. దొరకడం లేదని వెల్లడించారు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్​ జారీ చేయాల్సింది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు అధికారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సెస్పెండ్​ అయిన ఏడుగురు పోలీసులపై సోమవారం నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది.

పోలీసుల దొంగపని.. గస్తీకి వచ్చి ఫ్యాన్ చోరీ.. చివరకు అడ్డంగా బుక్కై..

దొంగ దగ్గరే ఇన్​స్పెక్టర్ దొంగతనం​.. ఇదెందయ్య సామీ..!

Last Updated : Sep 5, 2023, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.