ETV Bharat / bharat

ప్రయాణికుడిపై పోలీసు దౌర్జన్యం.. టికెట్​ ఉన్నా కాలితో తన్ని...

Police Kicks Passenger: టికెట్​ చూపించే అవకాశం కూడా ఇవ్వకుండానే ఓ రైలు ప్రయాణికుడిపై పోలీసు దాడి చేశాడు. అతడిని కాలితో తన్నాడు. ఈ ఘటన కేరళలో ఆదివారం జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

police kicks passenger
ప్రయాణికుడిపై పోలీసు దాడి
author img

By

Published : Jan 3, 2022, 3:41 PM IST

Updated : Jan 3, 2022, 4:00 PM IST

ప్రయాణికుడిపై పోలీసు దౌర్జన్యం

Police Kicks Passenger: కేరళలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. రైలులో ఓ ప్రయాణికుడిని పోలీసు కాలితో తన్ని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది. కాసర్​గోడ్​ నుంచి తిరువనంతపురానికి ప్రయాణిస్తున్న మావేలీ ఎక్స్​ప్రెస్​లో ఆదివారం ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది..

రైల్వే పోలీసులతో పాటు స్లీపర్​ కంపార్ట్​మెంట్​లోకి వచ్చిన ఏఎస్​ఐ ప్రమోద్​ అక్కడే ఉన్న బాధితుడిని టికెట్​ చూపించమని అడిగాడు. జనరల్​ టికెట్​ కొనుగోలు చేసి స్లీపర్ క్లాస్​లో ప్రయాణిస్తున్న బాధితుడు.. తన టికెట్​ను తీసి చూపించేలోపే ప్రమోద్​ అతనిపై దాడి చేశాడు. బాధితుడిని కాలితో తన్నాడు. అనంతరం వడకరా స్టేషన్​లో ప్రయాణికుడిని రైలు నుంచి గెంటేశాడు.

police kicks passenger
ప్రయాణికుడిపై పోలీసు దాడి

ఈ మొత్తం ఘటనను తోటి ప్రయాణికుడు వీడియో తీశాడు. వీడియో తీస్తున్నానని గ్రహించి తనను కూడా టికెట్​ చూపించమని డిమాండ్​ చేశాడని.. కానీ టీటీఈకే చూపిస్తానని చెప్పినట్లు ఆ ప్రయాణికుడు పేర్కొన్నాడు. వీడియో వైరల్​ కావడం వల్ల దీనిపై స్పందించిన కన్నూరు పోలీస్​ కమిషనర్ ఆర్​ ఏలంగో దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు రైల్వే పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చూడండి : 'భారత్​లో థర్డ్ వేవ్​కు ముగింపు అప్పుడే.. ఎన్నికల ర్యాలీలే సూపర్ స్ప్రెడర్లు'

Last Updated : Jan 3, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.