ETV Bharat / bharat

నడిరోడ్డుపై మహిళ ముందు పాడు పని- హెడ్​ కానిస్టేబుల్​పై వేటు - Yelahanka news

Police head constable suspended: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ హెడ్​కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు. బహిరంగ మూత్ర విసర్జన చేయడమే గాక.. తన ప్రైవేటు శరీర భాగాలను అతడు మహిళకు చూపాడు.

Police head constable suspended
మహిళ ముందు పాడు పని.. హెడ్​ కానిస్టేబుల్​పై సస్పెన్షన్ వేటు
author img

By

Published : Dec 22, 2021, 3:36 PM IST

Updated : Dec 22, 2021, 5:13 PM IST

నడిరోడ్డుపై మహిళ ముందు పాడు పని- హెడ్​ కానిస్టేబుల్​పై వేటు

Police head constable suspended: కర్ణాటక బెంగళూరు అమృతహళ్లి పోలీస్​ స్టేషన్​కు చెందిన హెడ్​ కానిస్టేబుల్​ చంద్రశేఖర్.. ఓ మహిళతో నీచంగా ప్రవర్తించాడు. రోడ్డుపై బహిరంగ మూత్ర విసర్జన చేయడమే గాక.. ఆమెకు తన ప్రైవేటు శరీర భాగాలను చూపాడు. ఈ ఆరోపణలకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రశేఖర్​ను సస్పెండ్ చేశారు. ఐపీసీ సెక్షన్​ 354(ఏ), 509 కింద ఎఫ్​ఐఆర్ ఫైల్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా యళహంక న్యూ టౌన్​ హౌసింగ్​ బోర్డు సమీపంలో రోడ్డుపై బైక్ ఆపి బహిరంగ మూత్ర విసర్జన చేశాడు చంద్రశేఖర్​. ఆ సమయంలో వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు ఓ మహిళ బయటకు వచ్చింది. ఆమెను చూసి హెడ్​ కానిస్టేబుల్​ తన ప్రైవేటు భాగాలను ప్రదర్శించాడు. అంతేగాక ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కోపోద్రిక్తురాలైంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. విషయం తెలుసుకున్న పై అధికారులు చంద్రశేఖర్​ను సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. బెంగళూరు ఈశాన్య డీసీపీ సీకే బాబా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చదవండి: Actor Vijay IT Raids: హీరో విజయ్​ బంధువు ఇంట్లో ఐటీ సోదాలు!

Last Updated : Dec 22, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.