ETV Bharat / bharat

డెన్మార్క్ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు - modi denmark pm news

డెన్మార్ ప్రధానమంత్రి మేట్ ఫ్రెడ్రిక్​సన్​తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (India Denmark news) ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాలు ఏర్పాటు చేసుకున్న హరిత వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై సమావేశంలో చర్చించినట్లు మోదీ (PM Modi news) తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్​సన్.

PM Modi Danish counterpart Frederiksen
డెన్మార్క్ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు
author img

By

Published : Oct 9, 2021, 1:59 PM IST

డెన్మార్క్​తో భారత్​కు ఉన్న సహకారాన్ని మరింత విస్తరించనున్నట్లు (India Denmark news) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) పేర్కొన్నారు. డెన్మార్క్ ప్రధాని మేట్ ఫ్రెడ్రిక్​సన్​తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ఆయన.. కొవిడ్ సమయంలో ఇరుదేశాలు హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (India Denmark Green Strategic Partnership) ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. దీనిపై తాజా సమావేశంలో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమిలో (International Solar Alliance members) డెన్మార్క్ భాగస్వామి కావడం సంతోషకరమని ప్రధాని అన్నారు. (India Denmark relations)

"భారత్-డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించాం. సప్లై చైన్, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఇరుదేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తరించాలని సంకల్పించుకున్నాం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

భారత్, డెన్మార్​లు అంతర్జాతీయ వ్యవస్థపై విశ్వాసం ఉంచే దేశాలని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్​సన్ అన్నారు. హరిత అభివృద్ధి, హరిత పరివర్తనం.. రెండూ సమన్వయంతో పనిచేస్తాయనేందుకు భారత్, డెన్మార్ మధ్య సహకారం ప్రత్యక్ష ఉదహరణ అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు ఫ్రెడ్రిక్​సన్.

"మొత్తం ప్రపంచానికి మీరు (ప్రధాని మోదీ) ఆదర్శం. 10 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన నీరు అందించే బృహత్తర లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకున్నారు. డెన్మార్క్​ను సందర్శించేందుకు మీరు అంగీకరించడం మాకు గర్వకారణం."

-మేట్ ఫ్రెడ్రిక్​సన్, డెన్మార్క్ ప్రధాని

ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల ప్రతులను అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు.

గాంధీకి నివాళులు

మూడు రోజుల పర్యటన నిమిత్తం భారతకు వచ్చారు డెన్మార్క్ ప్రధాని. రాష్ట్రపతి భవన్​కు విచ్చేసిన ఫ్రెడ్రిక్​సన్​కు మోదీ స్వయంగా స్వాగతం పలికారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్ముడి స్మారకాన్ని సందర్శించి.. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. భారత్‌ తమ మిత్రదేశంగా ఫ్రెడ్రిక్​సన్ పేర్కొన్నారు. ఈ పర్యటన ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఓ మైలురాయిగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

india denmark pm
రాష్ట్రపతి భవన్ ఎదురుగా డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్​సన్​తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఇదీ చదవండి: రాష్ట్రపతి ​భవన్​లో డెన్మార్క్​ ప్రధానికి మోదీ స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.