దేశవ్యాప్తంగా పీఎం కేర్స్ నిధులతో(pm cares fund news) ఏర్పాటు చేసిన 35 పీఎస్‌ఏ(ప్రెషర్ స్వింగ్ అడాప్షన్) ఆక్సిజన్ ప్లాంట్లను(oxygen plants in india) ప్రధాని నరేంద్ర మోదీ(modi news latest) ప్రారంభించారు. ఉత్తరాఖండ్ రిషికేశ్ ఎయిమ్స్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. ఈ క్రమంలో మాట్లాడిన ప్రధాని.. కరోనాపై పోరులో భాగంగా స్వల్పకాలంలో వైద్య సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు. కరోనా విస్తరణ తొలిరోజుల్లో దేశంలో ఒక్క టెస్టింగ్ లాబోరేటరీ ఉండగా.. ప్రస్తుతం 3000 టెస్టింగ్ ల్యాబ్‌లు ఉన్నట్లు తెలిపారు. అలాగే మాస్కులు దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి తయారు చేసి ఎగుమతి చేసే స్థితి ఎదిగామన్నారు. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా.. కొవిన్ పోర్టల్ ద్వారా భారీ సంఖ్యలో కరోనా టీకా డోసుల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,224 ఆక్సిజన్ ప్లాంట్లకు పీఎం కేర్స్ ఫండ్స్(pm cares fund news) ద్వారా నిధులు మంజూరు చేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. వీటిలో 1,100లకు పైగా ప్లాంట్లు రోజుకు 1,750 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపింది.
దేశంలో కరోనా విస్తరణ నేపథ్యంలో తలెత్తిన ఆక్సిజన్ కొరతను నివారించే దిశగా చర్యలు ప్రారంభించింది కేంద్రం. అలాగే వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటును ముమ్మరం చేసింది.
ఇదీ చూడండి: Covid cases in India: దేశంలో మరో 22వేల మందికి కరోనా