ETV Bharat / bharat

చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న ప్రధాని

స్వాతంత్ర పోరాటంలో మైలురాయిగా నిలిచిన చౌరీ చౌరా సంఘటనకు నేటితో వందేళ్లు. ఈ నేపథ్యంలో.. చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాలను ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఓ తపాలా బిళ్లను కూడా ఆవిష్కరించనున్నారు.

author img

By

Published : Feb 4, 2021, 6:23 AM IST

చౌరీ చౌరా శ‌త జయంతి ఉత్సవాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లోని చౌరీ చౌరాలో ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఓ తపాలా బిళ్లను కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

చౌరీ చౌరా ఘ‌ట‌న‌కు వచ్చే ఏడాదికి వందేళ్లు నిండనున్న నేప‌థ్యంలో సంవత్సరం పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 75 జిల్లాల్లో వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు ఈ కార్యక్రమాలు జరుగుతాయి.

చౌరీచౌరా ఘటన జరిగిన ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ జిల్లాలోని స్మారక కేంద్రాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది యోగి సర్కార్​.

చౌరీ చౌరా అంటే..

దేశ స్వాతంత్ర పోరాటంలో చౌరీ చౌరా ఘ‌ట‌న ఓ విశిష్ట ఘట్టం. 1922 ఫిబ్రవరి 4న చౌరీచౌరాలో సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటున్న వారిపై బ్రిటిష్‌ సైన్యం కాల్పులు జరపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఆగ్రహించిన ఉద్యమకారులు అక్కడి పోలీసు పోస్టుపై దాడి చేసి 24 మంది బ్రిటిష్‌ భద్రతా సిబ్బందిని హతమార్చారు.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌లో మళ్లీ చేరేందుకు సిద్ధంగా ఉన్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.