PM Modi Telangana Tour : ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి..గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం హకీంపేట్ నుంచి మోదీ వరంగల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం 10:15 గంటలకు వరంగల్‌లోని మామునూరు ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
PM Modi Visits Telangana : ఉదయం 11:40 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి మోదీ చేరుకుని.. వర్చువల్ విధానంలో రూ.521 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. రూ.2 ,147 కోట్ల వ్యయంతో.. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఇంటర్ కారిడార్‌కు, రూ.3,441 కోట్ల వ్యయంతో ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మైదానంలో విజయ్ సంకల్ప బహిరంగసభలో పాల్గొంటారు.
PM Modi Public Meeting In Warangal : ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అడగడుగున్న తనిఖీలను విస్తృతం చేశారు. ఎస్పీజీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటించే మార్గాల్లో మూడంచెల భద్రతను కల్పించారు. స్థానిక పోలీసులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు మూడున్నర వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. 29 వాహనాలతో భారీ కాన్వాయ్ సిద్ధం చేశారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అదనంగా ఉంటాయి.
20 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్.. సీపీ ఉత్తర్వులు జారీ : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీల పరిధిలో 20 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఓరుగల్లు పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 12:55 గంటలకు మామునూరు నుంచి సికింద్రాబాద్ హకీంపేట్‌కు వెలుతారు. అక్కడి నుంచి మోదీ రాజస్థాన్ బయలుదేరి వెళ్లనున్నారు.
మరోవైపు తొలిసారిగా ఓరుగల్లుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు.. కమలం సేన సర్వ సన్నద్ధమైంది. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఆ పార్టీ.. సన్నాహక సమావేశాలు నిర్వహించి.. శ్రేణులను సమాయత్తం చేసింది. నగరంలో మోదీకి స్వాగతం పలుకుతూ.. భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: Railway Wagon Manufacturing Unit : కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు.. నేడు భూమిపూజ
PM Modi Warangal Tour : మోదీ సభకు భారీ జన సమీకరణ కోసం బీజేపీ పక్కా ప్లాన్!
Modi Tour in Telangana : జులై 8న వరంగల్‌కు ప్రధాని.. రూ.6,050 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన