వేగంగా మారుతున్న సాంకేతికత కారణంగా రాబోయే రోజుల్లో స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్‌లకు అధిక డిమాండ్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా దేశ యువతను ఉద్దేశించి వర్చువల్గా మోదీ ప్రసంగించారు. రాబోయే తరం యువతలో నైపుణ్యాభివృద్ధి దేశానికి అవసరమని ఆయన అన్నారు.
"ఆదాయం రాగానే నేర్చుకోవడం ఆపకూడదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకునే వ్యక్తి మాత్రమే.. మనగలుగుతారు. ఈ సూత్రం ప్రజలకే కాక దేశాలకూ వర్తిస్తుంది"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
యువతలో నైపుణ్యాభివృద్ధి.. ఆత్మనిర్భర్ భారత్‌కు కీలకమైన పునాదిగా మోదీ అభివర్ణించారు. 1.25 కోట్లకు పైగా యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లు.. వరల్డ్ యూత్ స్కిల్ డే ప్రాధాన్యాన్ని పెంచిందని అన్నారు.
ఇదీ చదవండి : పార్లమెంట్ సమావేశాలకు సన్నద్ధమవ్వండి: మోదీ