రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ఈ నెల 8న(సోమవారం) ప్రసంగించే అవకాశముంది. ఈ మేరకు వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సభాముఖంగా ఆయన సమాధానం చెప్పే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే.. అందరి దృష్టి ప్రధాని ప్రసంగంపైనే ఉంటుంది.
కొత్త సాగు చట్టాలపై ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానంగా మోదీ ప్రసంగం ఉండనుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'రక్షణ రంగంలో స్వావలంబనే కీలకం'