సెప్టెంబర్ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. దీనికి షెడ్యూల్ ఖరారు కాలేదని.. అయితే ప్రధాని సందర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయని జాతీయ మీడియా తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 23-24 తేదీల్లో ప్రధాని అమెరికా పర్యటన ఉండవచ్చని అంచనా. ఈ పర్యటనలో భాగంగా మోదీ తొలుత వాషింగ్టన్ చేరుకుంటారని అనంతరం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం(UNGA)లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్తారని తెలుస్తోంది. ఈ ఏడాది సర్వసభ్య సమావేశాన్ని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.
ఇక ప్రస్తుత పర్యటన చేపడితే కరోనా తర్వాత ప్రధాని మోదీకి ఇది మొదటి విదేశీ పర్యటన అవుతుంది. అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం బైడెన్‌తో మొదటి వ్యక్తిగత సమావేశం కానుంది. బైడెన్‌తో పాటు.. క్వాడ్, జీ-7 దేశాధినేతలను మోదీ కలవనున్నారు.
మోదీ చివరిసారిగా 2019లో అమెరికాను సందర్శించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇవీ చదవండి: