ETV Bharat / bharat

PM Modi Life Stone Painting : 11రోజుల్లో రాళ్లపై మోదీ జీవిత చరిత్ర.. స్టోన్​ పెయింటింగ్​లో 'హర్షిత' భళా.. విదేశాల నుంచి ఫుల్​​ ఆర్డర్లు! - రాళ్లపై ప్రముఖుల బొమ్మలు పెయింటింగ్​ వార్తలు

PM Modi Life Stone Painting : కేవలం 11 రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రను రాళ్లపై పెయింటింగ్​ రూపంలో ఆవిష్కరించింది ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ యువతి. అంతేకాకుండా దేశంలోని పలువురు ప్రముఖుల చిత్రాలనూ వీటిపై చిత్రీకరించింది. స్టోన్​ పెయింటింగ్​ పట్ల ఆసక్తి కనబరుస్తున్న ఆ యువతి విశేషాలు మీకోసం.

PM Narendra Modi Life On Stone Painting
PM Narendra Modi Life On Stone Painting
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 11:53 AM IST

రాళ్లపై ప్రధాని మోదీ జీవిత చరిత్ర.. కేవలం 11 రోజుల్లోనే పూర్తి చేసిన స్టోన్​ పెయింటర్​!

PM Modi Life Stone Painting : స్టోన్​ పెయింటింగ్​తో సత్తా చాటుతోంది ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​కు చెందిన యువతి. కేవలం 11 రోజుల్లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్రను రాళ్లపై ఆవిష్కరించింది. దీంతో ఆమె అద్భుతమైన ప్రతిభ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం యోగి, రాష్ట్రపతి కోవింద్​ బొమ్మలు!
జిల్లాలోని పంకి ప్రాంతానికి​ చెందిన హర్షిత అనే యువతి ప్రధాని మోదీ జీవిత చరిత్రను 11 రోజుల్లోనే రాళ్లపై చిత్రీకరించింది. దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల బొమ్మలనూ గీసింది. వీటిల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త రతన్​ టాటా చిత్రాలు కూడా ఉండటం విశేషం.

PM Narendra Modi Life On Stone Painting
రాళ్లపై యూపీ ముఖ్యమంత్రి యోగి, ప్రధాని మోదీ, శ్రీనివాస రామానుజన్​ చిత్రాలు

ఇటీవలే ఆమె రతన్​ టాటా కార్యాలయం నుంచి అభినందనలు కూడా అందుకుంది. అంతేకాకుండా నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆలింగనం చేసుకుంటున్న పెయింటింగ్​తో పాటు ఆమో గీసిన మాజీ లోక్​సభ స్పీకర్​ మీరా కుమార్​, గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్​ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

PM Narendra Modi Life On Stone Painting
ప్రముఖ మ్యాగ్​జైన్​ల కవర్​పేజీలపై వచ్చిన మోదీ చిత్రాలు

ఆన్​లైన్​లో ఆర్డర్ల మోత..!
హర్షిత నైపుణ్యానికి సోషల్​ మీడియాలో పెద్దఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాకుండా తమకు కూడా అటువంటి పెయింటింగ్​లు చేసి పంపాలంటూ విదేశాల నుంచి సైతం ఆన్​లైన్​లోనే ఆర్డర్ల వస్తున్నాయి. స్టోన్​ పెయింటింగ్​ పట్ల ఆసక్తిని కనబరుస్తున్న యూపీ యువతి.. దీనినే తన కెరీర్‌గా మలుచుకొని ముందుకు సాగుతానని చెబుతోంది. ప్రస్తుతం ఈమె కాన్పుర్​ యూనివర్సిటీలో బ్యాచిలర్​ ఆఫ్​ ఫైన్​ ఆర్ట్స్(బీఎఫ్ఏ) చదువుతోంది.

"ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ రావాలంటే అంతకన్నా ముందు వచ్చే ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను అదే చేశాను."

- హర్షిత, స్టోన్​ పెయింటర్​.

ఇలా వచ్చిందా ఆలోచన!
ఇంజినీరింగ్​ చేయాలనుకున్న హర్షిత.. కొన్ని కారణాల వళ్ల దానిని చదవలేకపోయింది. ఈ క్రమంలో ఆమె చిన్న పిల్లలకు ట్యూషన్స్​ చెప్పేది. అప్పుడు కొందరు విద్యార్థులు హర్షితకు కొన్ని రాళ్లు తెచ్చిచ్చారు. దీంతో తన దగ్గర ఉన్న రంగులతో రాళ్లపై పెయింట్​ వేయడం ప్రారంభించింది. ఇలా స్టోన్స్​పై పెయింటింగ్​ వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన హర్షితకు వచ్చింది. తద్వారా తన స్టోన్​ పెయింటింగ్​ కళకు పునాది పడింది. ఇక అప్పట్నుంచి ఏమి ఆలోచించకుండా తన ఆసక్తికి పదును పెట్టింది. కొద్ది కాలంలోనే ఆ నైపుణ్యం పట్ల పట్టు సాధించింది. ప్రస్తుతం దానిని నిర్విరామంగా కొనసాగిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.