ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలతో పాటు.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, బాహుపాక్షిక సంబంధాలపై చర్చించారు అగ్రనేతలు. ఈ నేపథ్యంలో భారత్- శ్రీలంక మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు.
కరోనా సవాళ్ల నేపథ్యంలో.. ఇరు దేశాల అధికారుల మధ్య సంబంధం కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.