ETV Bharat / bharat

తమిళనాట అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం - assembly elections

తమిళనాడులోని కోయంబత్తూర్​లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. నైవేలిలో నిర్మించిన థర్మల్​ విద్యుత్​ కేంద్రాన్ని జాతికి అంకితం ఇచ్చారు. అంతకుముందు.. తమిళనాడు మాజీ సీఎంలు ఎంజీఆర్​, జయలలిత చిత్రపటాలకు నివాళులు అర్పించారు ప్రధాని.

PM Modi inaugurates various projects in TN
ఆ డ్యామ్​ ఆధునికీకరణతో రైతులకు మేలు: మోదీ
author img

By

Published : Feb 25, 2021, 5:22 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు కోయంబత్తూర్​లో పర్యటించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. నైవేలిలో నిర్మించిన థర్మల్​ విద్యుత్​ కేంద్రాన్ని ప్రారంభించి.. జాతికి అంకితమిచ్చారు. రూ.8,000 కోట్లతో ఈ విద్యుత్​ కేంద్రాన్ని నిర్మించారు. ఎన్​ఎల్​సీఐఎల్​కు చెందిన 709 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్​ కేంద్రాన్ని వర్చువల్​గా ప్రారంభించారు మోదీ. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్​ బన్వరిలాల్​ పురోహిత్​, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్​ సెల్వం హాజరయ్యారు.

PM Modi inaugurates various projects in TN
సభావేదికపై మోదీ, పళనిస్వామి, పన్నీర్​సెల్వం

కార్యక్రమానికి హాజరైన జనం

తిరుప్పూర్​, మదురై, తిరుచ్చిరాపల్లిలో నిర్మించిన 4,144 గృహాలను కూడా ఆవిష్కరించారు ప్రధాని. అంతకుముందు.. కోయంబత్తూర్​లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్​, జయలలిత చిత్రపటాలకు నివాళులు అర్పించారు.

ఎంజీఆర్​, జయలలితకు నివాళులు

ఆ ప్రాజెక్టుతో రైతులకు లబ్ధి..

భవానీ సాగర్​ డ్యామ్​ ఆధునికీకరణ కోసం పునాది రాయి వేశామని, దీనితో 2 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందించొచ్చని తెలిపారు. ఈరోడ్​, కరూర్​, తిరుప్పూర్​ జిల్లాల రైతులకు ఇదెంతో మేలు చేస్తుందని అన్నారు మోదీ.

ఇదీ చూడండి: 'మొతేరా' మైదానం పేరు మార్పుపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.