ETV Bharat / bharat

'కాంగ్రెస్​కు ఆప్ ఫొటోకాపీ​.. పంజాబ్​ మాకు చాలా ముఖ్యం' - పఠాన్​కోట్ పంజాబ్ సభ

PM Modi in Pathankot: బుజ్జగింపు రాజకీయాలకు పంజాబ్ వీడ్కోలు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పంజాబ్​కు భాజపా అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. విపక్షాలు మాత్రం రాష్ట్రాన్ని రాజకీయ కోణంలోనే చూస్తాయని మండిపడ్డారు.

PM MODI IN PATHANKOT
PM MODI IN PATHANKOT
author img

By

Published : Feb 16, 2022, 1:13 PM IST

Updated : Feb 16, 2022, 1:25 PM IST

PM Modi in Pathankot: పంజాబ్​లోని పేదలతో పాటు దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆకలితో ఉండకూడదని ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పంజాబ్​లోని పఠాన్​కోట్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఏఏ రాష్ట్రాల్లో అయితే భాజపా నిలదొక్కుకునే స్థితికి చేరుకుంటుందో.. అక్కడ కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందని మోదీ చెప్పారు.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు మోదీ. ఒకరు పంజాబ్​ను లూటీ చేస్తే.. మరొకరు దిల్లీలో స్కాముల మీద స్కాములు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

"మాకు పంజాబ్ చాలా ముఖ్యం. విపక్షాలు మాత్రం పంజాబ్​ను రాజకీయ కోణంలోనే చూస్తుంటాయి. బుజ్జగింపు రాజకీయాలకు పంజాబ్​ వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. కెప్టెన్ సాబ్(అమరీందర్ సింగ్) కాంగ్రెస్​లో ఉన్నప్పుడు.. ఆ పార్టీ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఆపేవారు. ఇప్పుడు ఆయన కూడా అందులో నుంచి బయటకు వచ్చారు. ఆప్, కాంగ్రెస్ రెండూ ఒకటే. కాంగ్రెస్ ఒరిజినల్ అయితే.. ఆప్ దానికి ఫొటోకాపీ. వీరిద్దరూ ఒక్కటే అయినా.. పంజాబ్​లో మాత్రం ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అంతకుముందు.. గురు రవిదాస్ జయంతి సందర్భంగా దిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ మందిరాన్ని దర్శించుకున్నారు మోదీ. మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. విశ్రమ్ ధామ్​లో నిర్వహించిన 'షాదాబ్ కీర్తన్​'లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ వాద్య పరికరాన్ని చేతిలో పట్టుకొని.. గురు రవిదాస్​ను కీర్తించారు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీ చెక్క భజన.. గురు రవిదాస్ ఆలయంలో...

Last Updated : Feb 16, 2022, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.