ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దేశం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ట్వీట్ చేశారు.
"2021 ఆనందభరితం కావాలి. ఈ ఏడాది.. అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, భాగ్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మనందరి ఆశలు నిజం కావాలి."
- నరేంద్ర మోదీ, ప్రధాని
ప్రధానితో పాటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.