ETV Bharat / bharat

ఉక్రెయిన్​లో యుద్ధం.. రక్షణ సన్నద్ధతపై మోదీ కీలక సమీక్ష - మోదీ ఉక్రెయిన్ యుద్ధం

PM Modi: ఉక్రెయిన్​, రష్యా మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న క్రమంలో దేశ రక్షణ సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ రక్షణ రంగంలో సాంకేతికతను భాగం చేయాలని అధికారులకు సూచించారు.

PM Modi
ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
author img

By

Published : Mar 13, 2022, 1:28 PM IST

Updated : Mar 13, 2022, 3:53 PM IST

PM Modi: ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు చేస్తున్న క్రమంలో భారత రక్షణ సన్నద్ధత, ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(సీసీఎస్)తో సమావేశమయ్యారు.

Modi CCS meeting

ఉక్రెయిన్​లో ప్రస్తుత పరిణామాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు మోదీ. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు చేపట్టిన 'ఆపరేషన్ గంగ' కార్యక్రమంపై ఆరా తీశారు. ఖార్కివ్​లో మరణించిన నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని భారత్​కు తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో భాగంగా.. దేశ భద్రతపై ఉన్నతాధికారులు అధికారులు ప్రధానికి వివరాలు తెలియజేశారు. రక్షణ కోసం సరిహద్దులతో పాటు వాయు, సముద్ర మార్గాల్లో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలను వివరించారు.

సాంకేతికత వినియోగంపై...

'ఈ సందర్భంగా రక్షణ రంగంలో సాంకేతికత ఉపయోగంపై ప్రధాని కీలక సూచనలు చేశారు. దేశ రక్షణ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను భాగం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు రక్షణ రంగంలో ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో భారత్ పురోగతిని సమీక్షించారు. రక్షణ రంగంలో భారత్​ను స్వయం సమృద్ధ దేశంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని మోదీ స్పష్టం చేశారు. దీని వల్ల దేశ రక్షణ సామర్థ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థ సైతం బలపడుతుందని చెప్పారు' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పోలాండ్​కు భారత ఎంబసీ

ఉక్రెయిన్​లోని భారత ఎంబసీని తాత్కాలికంగా పోలాండ్​కు తరలిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. రాజధాని కీవ్​లో పరిస్థితులు క్షీణించడం, ఉక్రెయిన్ పశ్చిమ భాగాన దాడులు తీవ్రం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.

ఉక్రెయిన్​పై ఆగని దాడులు..

ఉక్రెయిన్​పై గత 18 రోజులుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. అంతర్జాతీయంగా ఆంక్షలు విధిస్తున్నా వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్​ రాజధాని కీవ్​తో పాటు ప్రముఖ నగరాలను రష్యా సేనలు చుట్టుముట్టాయి. కీవ్​కు 15 కిలోమీటర్ల దూరంలో సేనలు విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. రష్యా దాడిలో పలు చిన్న నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని జెలెన్​స్కీ వివరించారు. యుద్ధంలో తమ సైనికులు 1,300 మంది, పౌరులు 579 మంది చనిపోయారని, వెయ్యికిపైగా గాయపడ్డారని శనివారం తెలిపారు.

ఇదీ చూడండి: రష్యా సరికొత్త అస్త్రం.. సామాన్య పౌరులకు ముప్పు తిప్పలు!

Last Updated : Mar 13, 2022, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.