దేశవ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించింది. ఈ ప్లాంట్లను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం పీఎం కేర్స్ నుంచి నిధులు కేటాయించింది.
దిల్లీలో ఆక్సిజన్ కొరత దృష్ట్యా.. యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ప్రణాళికలు రచిస్తోంది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ఆన్‌బోర్డ్ ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగించిన సాంకేతికతను వీటి నిర్మాణంలో ఉపయోగించున్నారు.
ఇవీ చూడండి: