దిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో సమానమైన అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు ఉండేలా తీసుకొచ్చిన "ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ సవరణ చట్టం- 2021(జీఎన్సీటీడీ)"పై వివరణ ఇవ్వాల్సిందిగా.. దిల్లీ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని దిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత నీరజ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రికి, దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ లోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా జీఎన్సీటీడీ చట్టాన్ని సవరించారని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దిల్లీ కేబినెట్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎల్జీకి తెలియజేయాల్సి ఉంటుందని.. ఐతే గవర్నర్ ఏకాభిప్రాయం ఉండబోదని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమని ఆరోపించారు.
ఇదీ చూడండి: నారదా కేసు: సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ
ఇదీ చూడండి: కొవిడ్ సహకారంపై అమెరికాతో జైశంకర్ చర్చ