ఎప్పుడూ రద్దీగా ఉండే దక్షిణ దిల్లీలోని ఓ ప్లైఓవర్ కింద రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయింది. 10 నుంచి 15 ఫీట్ల లోతు భారీ గుంత ఏర్పడింది. ఈ ఘటనను చూసి అటు నుంచి వెళ్తున్న వాహనచోదకులు హడలిపోయారు. ఎవరికీ ఏమీ కాకపోవటం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పీడబ్ల్యూడీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గుంతపడిన రోడ్డుచుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ మార్గం మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. పీడబ్ల్యూడీ సిబ్బంది రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టారు. భూగర్భ పైపులైన్ లీకేజీ కారణంగానే రోడ్డు కుంగిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి:వరద నీటిలో ఎల్పీజీ సిలిండర్లు- పేలి ఉంటేనా!